
టోల్‌ప్లాజా వద్ద గ్రామస్థుల ఆందోళన
బిక్నూర్: నిజామాబాద్ జిల్లా బిక్నూర్ టోల్ ప్లాజా వద్ద ఆదివారం స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. టోల్‌ప్లాజా వద్ద స్థానికులకు చెందిన వాహనాలకు చలానాల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.
తమకు చెందిన వాహనాలకు పదేపదే చలానాలు చెల్లించవలసి వస్తుందని దీనిపై మినహాయింపు ఇవ్వాలని టోల్‌ప్లాజా ఇంచార్జ్కు ప్రజలు వినతిపత్రం సమర్పించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఇంచార్జ్ గ్రామస్థులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు.