డీఈ కార్యాలయం ముట్టడి | villagers protests at electric DE office due to woman died | Sakshi
Sakshi News home page

డీఈ కార్యాలయం ముట్టడి

Published Wed, Dec 23 2015 4:40 PM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM

villagers protests at electric DE office due to woman died

మిర్యాలగూడ: అధికారుల నిర్లక్ష్యం వల్ల ఓ మహిళ మృతి చెందిందని.. కోపోద్రిక్తులైన గ్రామస్థులు బుధవారం విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఓల్టేజీ సమస్యపై విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కార్యాలయం ముట్టడికి యత్నించారు.
 
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ట్యాంక్ తండాలో మూడు రోజులుగా విద్యుత్ సరఫరాలో ఓల్టేజీ సమస్య తలెత్తింది. దీంతో ఇళ్లలోని పలు విద్యుత్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. తాజాగా.. గ్రామానికి చెందిన రమావత్ బుజ్జీ(35) టీవీ ఆన్ చేయడానికి ప్రయత్నించి విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. దీంతో ఆగ్రహించిన తండా వాసులు మృతదేహం సహా మిర్యాలగూడలోని డీఈ కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కావని తండావాసులు చెప్పుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement