పెళ్లింట విషాదం | A woman died with electrocution in Mahabubnagar | Sakshi
Sakshi News home page

పెళ్లింట విషాదం

Published Thu, Apr 27 2017 2:23 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

A woman died with electrocution in Mahabubnagar

► విద్యుదాఘాతంతో యువతి మృతి
 
నారాయణపేట: ఓ పెళ్లింట విషాదం అలుముకుంది. బట్టలు ఉతుకుతుండగా ఓ యువతి  విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని లైన్‌వాడ కాలనీకి  చెందిన అబ్దుల్‌ రహమాన్, హాజిర కూతురి వివాహానికి అతని సోదరి తాజ్‌ కూతురు షహెనాబేగం (16) వారం రోజులక్రితం పూణె నుంచి నారాయణపేటకు వచ్చింది. మూడ్రోజుల క్రితం పెళ్లి ముగియగా బుధవారం ఇంట్లో బట్టలు ఉతుకుతున్నారు.

వాషింగ్‌ మిషన్‌ వైరు తెగి ఉండటం గమనించకపోవడంతో పచ్చిబట్టలు బయటికి తీస్తుండగా వైరు తగిలి యువతి విద్యుదాఘాతానికి గురైంది. అరుపులు, కేకలు వేయడంతో కుటుంబసభ్యులు వెంటనే మిషన్‌ బంద్‌చేసి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయింది. పెళ్లి వేడుకలకు వచ్చి బిడ్డ చావు కొనితెచ్చుకుందని తల్లి బోరున విలపించింది. వివాహమైన మూడ్రోజులకే ఈ సంఘటన జరడంతో కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement