పావురాన్ని గ్రామకార్యదర్శికి అప్పగిస్తున్న లక్ష్మణరావు
సాక్షి, ఎర్రుపాలెం(ఖమ్మం): ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మామునూరుకు గురువారం చేరిన ఓ పావురం కలకలం రేపింది. గ్రామంలోని గంతాల లక్ష్మణరావు ఇంట్లో వాలిన పావురాన్ని పరిశీలించగా, ఒక కాలికి టీఎన్–999 అని, మరో కాలికి 7417 నంబర్‌తో కూడిన స్టిక్ట్కర్ ఉంది.
రెక్కలకు డెల్టా 1000 కేఎం అని స్టాంప్ వేసి ఉండగా.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై ఎం.సురేశ్ పరిశీలించి ఇది బెట్టింగ్ పావురం అయి ఉండొచ్చని, ప్రజలు అపోహలకు గురికావొద్దని సూచించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment