
వివాహితపై అత్యాచారయత్నం
మండలంలోని దేవుడ్‌పల్లి గ్రామానికి చెందిన వివాహతపై ఆదే గ్రామానికి చెందిన మహాత్మే అశోక్ మంగళవారం రాత్రి ...
కెరమెరి : మండలంలోని దేవుడ్‌పల్లి గ్రామానికి చెందిన వివాహతపై ఆదే గ్రామానికి చెందిన మహాత్మే అశోక్ మంగళవారం రాత్రి అత్యాచారయత్నం చేసినట్లు రాథోఢ్ తానాజి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దేవుడ్‌పల్లి గ్రామానికి ఓ వివాహిత తన పిల్లలతో ఇంట్లో పడుకుని ఉంది. భర్త ఆటోలో ఇతర గ్రామానికి వెళ్లడం గమనినించిన అశోక్ ఒంటరిగా ఉన్న వివాహిత ఇంట్లో చొరబడి ఆత్యాచారయత్నం చేయబోయాడు.
దీంతో సదరు మహిళ పెద్దపెట్టున కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు తరలివచ్చారు. ఇది గమనించిన అశోక్ పారిపోయాడు. అప్పటికే వచ్చిన భర్తతోపాటు గ్రామస్తులకు జరిగిన విషయాన్ని ఆ మహిళ చెప్పింది. బుధవారం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామానికి వివరాలు సేకరించి.. కేసు నమేదు చేసినట్లు తానాజి పేర్కొన్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.