చెప్పులు కర్రలు చూపిస్తున్న మహిళలు
‘నానో’ వద్దే వద్దు
Published Sun, Sep 4 2016 10:35 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
– కొండజూటూరు గ్రామస్తుల ఆందోళన
– రోడ్డుపై బైఠాయింపు
– అధికారులను అడ్డుకున్న వైనం
– గ్రామస్తులతో పోలీసుల చర్చలు
పాణ్యం: కొండజుటూరు గ్రామ సమీపంలో సుమారు వెయ్యి కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన శాంతిరాం నానో కెమికల్ పరిశ్రమకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆదివారం ఆందోళనకు దిగారు. సుమారు రెండు గంటలపాటు రోడ్డుపైనే బైఠాయించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించేందుకు కిందిస్థాయి అధికారులు ఆదివారం గోప్యంగా గ్రామంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే విషయం గమనించిన గ్రామస్తులు మూకుమ్మడిగా రోడ్డెక్కారు. తహసీల్దార్ చంద్రావతి అడ్డుకున్నారు. గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర ్భంగా ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలు 50 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే మహిళలు, చిన్నపిల్లలు సహా గ్రామస్తులు కర్రలు తీసకుఉని రోడ్డుపై బైఠాయించారు. 500 మంది వరకు స్థానికులు నిరసన గళం విప్పారు. పరిశ్రమ, అదీ ఇదీ అంటూ మరోసారి గ్రామంలోకి వస్తే ఎం జరిగినా తమది బాధ్యత కాదంటూ హెచ్చరించారు. దీంతో చేసేదేమి లేక అధికారులు, పోలీసులు వెనుదిరిగారు.
Advertisement