మండలంలోని పెద్దబోధనం గ్రామ సమీపంలోని వక్కిలేరులో గురువారం ఓ మృతదేహాన్ని కనుగొన్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పెద్దభోదనం(చాగలమర్రి): మండలంలోని పెద్దబోధనం గ్రామ సమీపంలోని వక్కిలేరులో గురువారం ఓ మృతదేహాన్ని కనుగొన్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హెడ్‌కానిస్టేబుల్‌లు నారాయణ, వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తుల సాయంతో బయటికి తీశారు. మృతుడు చిన్నబోధనం గ్రామానికి చెందిన ధన్‌రాజ్(48)గా గుర్తించారు. మూడు రోజుల కిందట ధన్‌రాజ్ ఇంటి నుంచి వెళ్లిపోయి కనపడ లేదు. బంధువులు ఆయన కోసం గాలిస్తుండగా గురువారం సాయంత్రం వక్కిలేరులో శవమై కనిపించాడు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతికి కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.