ఇంతవరకు ఎన్నో గ్రామాలు గురించి విన్నాం. అక్కడ ఉండే వింత ఆచారాలో లేక విచిత్రమైన వాతావరణ పరిస్థితులు గురించో విని ఉంటాం. కానీ ఇలాంటి విచిత్రమైన గ్రామం పేరు ఇప్పుడూ దాక విని ఉండే అవకాశమే లేదు. పైగా ఈ గ్రామం ఉత్తమ పర్యాటక గ్రామంగా అవార్డును కూడా గెలుచుకుంది.
వివరాల్లోకెళ్తే.. మేఘాలయ రాజధాని నగరం షిల్లాంగ్ నుంచి 60 కి.మీ దూరంలో కాంగ్‌థాంగ్ అనే గ్రామం ఉంది. దీన్ని 'విజిల్ విలేజ్'గా పిలుస్తారు. ఇక్కడ ప్రజలు తమ తోటి గ్రామస్తులను పేర్లతో పిలవరు. ఒక ట్యూన్(రాగం) పేరుతో పిలుచుకోవడమే ఇక్కడ ప్రత్యేకత. తమ సందేశాలను తెలియజేయడానికి ఈలలు వేయడం వంటివి చేస్తారు. ఇక్కడ ఉండే గ్రామస్తులకు రెండు పేర్లు ఉంటాయి. ఒకటి సాధారణ పేరు, మరోకటి పాట పేరు. షార్ట్ ట్యూన్‌లో ఇంటిలో పిలుచుకుంటే ఊరిలో ఉన్నప్పుడూ లాంగ్ ట్యూన్‌తో పిలుచుకుంటారు.
ఈ గ్రామంలో సుమారుగా 700 మంది గ్రామస్తులు ఉన్నారు. అందరికీ విభిన్న రాగాల ట్యూన్‌లు ఉన్నాయి. ఈ మేరకు కాంగ్‌థాంగ్ గ్రామ నివాసి ఫివ్‌స్టార్ ఖోంగ్‌సిట్ మాట్లాడుతూ...ఒక వ్యక్తిని సంబోధించడానికి ఉపయోగించే ట్యూన్‌ని వారి తల్లులే కంపోజ్ చేస్తారట. అలాగే అక్కడ గ్రామస్తుడు ఎవరైన చనిపోతే అతనితో పాటే అతడిని పిలిచే ట్యూన్ కూడా చనిపోతుందట. అక్కడ ఉండే ప్రతి ఒక్క గ్రామస్తుడికి ఒకో రాగం పేరుతో పిలుచుకుంటారు.
ఈ రాగాలతోటే వాళ్లు ఒకరితో ఒకరు సంభాషించుకుంటామని చెబుతున్నారు. ఇది వారికి తరతరాలుగా సాంప్రదాయంగా వస్తుందని చెప్పారు స్థానికులు. గతేడాది పర్యాటక మంత్రిత్వశాఖ కాంగ్‌థాంగ్ ఉత్తమ పర్యాట గ్రామంగా ది వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఎంపిక చేసింది. అంతేగాదు 2019లె బిహార్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ రాకేష్ సిన్హా ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని యూనెస్కో ట్యాగ్ ఇవ్వాల్సిందిగా సూచించారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment