ముప్పుతిప్పలు పెట్టిన కొండచిలువ
ముప్పుతిప్పలు పెట్టిన కొండచిలువ
Published Sun, Oct 9 2016 9:56 PM | Last Updated on Mon, Oct 1 2018 5:19 PM
చిగురుపాడు (అచ్చంపేట): 12 అడుగుల కొండ చిలువ ఓ ఇంట్లోకి దూరి గ్రామస్తులను ముప్పుతిప్పలు పెట్టింది. అచ్చంపేట మండలం చిగురుపాడు గ్రామానికి చెందిన గొట్టిముక్కల సాంబశివరాజు నివాసంలోని వరండాలో శనివారం రాత్రి 10గంటల సమయంలో కొండచిలువ ప్రత్యక్షమైంది. సాంబశివరాజు భార్య దీనిని చూసి భర్తకు చెప్పింది. కొండచిలువ వరండా మొత్తం తిరుగుతూ ఇంట్లో వారందరిని తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఇరుగుపొరుగు వారిని పిలువగా వారు కర్రలు తీసుకుని వచ్చి కొట్టినా పాము చావలేదు. పైగా రబ్బరు సాగినట్లుగా సాగింది. సుమారు రెండు గంటల పాటు అందరినీ ముప్పుతిప్పలు పెట్టి పక్కనే ఉన్న చెట్ల పొదలోకి దూరింది. దీంతో గ్రామస్తులు పొక్లెయిన్ తెప్పించి పొదను తవ్వించి కొండచిలువను వెలికి తీయించి గొడ్డలితో నరికి చంపించారు.
Advertisement
Advertisement