కొవ్వూరు మండలం వాడపల్లి ఇసుక ర్యాంప్ నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి తరలిస్తున్న ఇసుక లారీలను స్థానికులు అడ్డుకున్నారు.
కొవ్వూరు(పశ్చిమగోదావరి): కొవ్వూరు మండలం వాడపల్లి ఇసుక ర్యాంప్ నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి తరలిస్తున్న ఇసుక లారీలను స్థానికులు అడ్డుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 మధ్యే ఇసుకను తరలించేందుకు పర్మిషన్ ఉంది. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి సమయంలో ఇసుక తరలిస్తుండటంతో స్థానికులు ప్రతిఘటించారు.
దీంతో చేసేదేమీ లేక ట్రాక్టర్లు, లారీలలో నింపిన ఇసుకను ఖాళీ చేయించి అధికారులు వెనుదిరిగారు. సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.