దాహార్తి తీర్చుకునేందుకు వచ్చిన నీల్‌గాయిపై కుక్కల మంద దాడి చేసిన ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్‌లో గురువారం ఉదయం చోటుచేసుకుంది.
- రక్షించిన గ్రామస్తులు
మెదక్
దాహార్తి తీర్చుకునేందుకు వచ్చిన నీల్‌గాయిపై కుక్కల మంద దాడి చేసిన ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్‌లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఓ నీల్‌గాయి(మనుబోతు) దాహార్తి తీర్చుకునేందుకు వ చ్చింది. దానిపై వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటన గమనించిన గ్రామస్తులు కుక్కల దాడి నుంచి నీల్గాయ్ ను కాపాడారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. గ్రామానికి వచ్చిన అటవీ అధికారులకు నీల్గాయ్ ని అప్పగించారు.