Nilgai
-
తార్ మార్ తక్కర్ మార్.. చివరికి భలే ట్విస్ట్
ప్రాణి ప్రపంచం వాటి మనుగడ పోరాటాన్ని మాత్రమే కాదు అప్పుడప్పుడు సరదాను కూడా మానవాళికి పంచుతుంటుంది. అలాంటి వీడియోనే ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ పులి.. నీల్గై (బ్లూబక్)ను చూసి వేటాడాలనుకుంది. దాడి చేసే క్రమంలో నెమ్మదిగా ముందుకు కదిలింది. సరిగ్గా.. ఆ నీలిజింక తలెత్తి చూసే సమయానికి కిందకు వంగుని దాగుడు మూతలు ఆడింది. చివరికి.. ఆ రెండింటి మధ్య జరిగిన తార్ మార్ తక్కర్ మార్ ఫలితం ఏంటో మీరూ చూసేయండి. Hide and seek! It began when she saw the #Nilgai at about 80m. Interestingly, the #tiger had all the grass to hide, but she continued to blend with the road without cover. #SatpuraNationalPark #Hunting #predator #SavetTiger #TigerTales @NatureIn_Focus @RGSustain1 @conserve_ind pic.twitter.com/qMbK1fOhXG — Rajesh Sanap (@RajeshVS87) November 6, 2022 మధ్యప్రదేశ్ సాత్పురా నేషనల్ పార్క్‌లో ఈ ఘటన జరిగిందని రాజేష్ సనాప్ అనే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ వీడియోను పోస్ట్ చేశారు. విపరీతమైన లైకులు, వ్యూస్‌తో దూసుకుపోతోంది ఆ వీడియో. సరదా కామెంట్లు మాత్రమే కాదు.. ఈ వీడియోపై సీరియస్ కోణంలోనూ కామెంట్లు కనిపిస్తున్నాయి. ఇదీ చూసేయండి: రైళ్లలో కొందరు ఛాయ్ ఎలా వేడి చేస్తారో తెలుసా? -
దాహంతో వచ్చి.. కాలువలో పడి..
నిజాంసాగర్(జుక్కల్): వేసవి కాలం ఆరంబానికి ముందే వన్యప్రాణులకు తాగునీటి తిప్పలు ప్రారంభమయ్యాయి. నీటికోసం వచ్చిన మూడు నీల్గాయ్లు గురువారం నిజాంసాగర్ మండలంలోని సింగితం రిజర్వాయర్ కాలువలో పడిపోయాయి. రిజర్వాయర్ కాలువలో నుంచి బయటకు రాలేక ఇబ్బందిపడ్డాయి. దీనిని గమనించిన స్థానికులు బాన్సువాడ అటవీశాఖ సెక్షన్ అధికారి సిద్ధార్థకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. బాన్సువాడ డివిజనల్ అటవీశాఖ అధికారి గోపాల్రావ్, సెక్షన్ ఆఫీసర్ సిద్ధార్థ సంఘటన స్థలానికి చేరుకుని బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు. సుమారు మూడు గంటలపాటు శ్రమించి వాటిని బయటికి తీశారు. ఒక నీల్గాయ్ రహదారి వెంట పరుగులు పెట్టడంతో ఊర కుక్కలు వెంబడించాయి. దీంతో అది నిజాంసాగర్ ప్రధాన కాలువలోకి దూకింది. ప్రధాన కాలువలో నీటి ప్రవాహం 1,600 క్యూసెక్కులు ఉండడంతో నీటిలో కొట్టుకుపోయింది. స్థానికులు సిరాజుద్దీన్, హన్మాండ్లు కాలువలోకి దూకి, తాళ్లతో బంధించి సురక్షితంగా బయటకు తీశారు. ఆ నీల్గాయ్కి గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స చేసి అటవీ ప్రాంతంలో వదిలారు. -
దస్నాపూర్‌లో నీల్గాయి హతం
ఆదిలాబాద్, వేమనపల్లి (బెల్లంపల్లి) : గాంధీ జయంతి, వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల ప్రారంభం రోజునే దారుణం చోటు చేసుకుంది. దస్నాపూర్ సమీప అటవీ శివారులోకి మేత కోసం వచ్చిన నీల్గాయిని గ్రామానికి చెందిన కొందరు హతమార్చారు. వేట కుక్కలతో వెంబడించి కొట్టి చంపారు. ఈ సంఘటన ఉదయం పూటనే జరిగినా బయటికి పొక్కకుండా నీల్గాయి కళేబరాన్ని సమీప అటవీ ప్రాంతంలో దాచి పెట్టారు. సాయంత్రం రహస్యంగా దాని తల వేరు చేశారు. గ్రామ శివారులో ముక్కలుగా కోసి సుమారు 70 పోగులు పెట్టారు. మాంసం కొందరి వ్యక్తులకు అందకపోవడంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు. కుశ్నపల్లి అటవీ రేంజ్ అధికారి అప్పలకొండ సూచన మేరకు బీట్ అధికారి మధూకర్, స్ట్రైకింగ్పోర్స్, బేస్‌క్యాంప్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. నీల్గాయి తల, గంజులో పట్టిన రక్తం, కాళ్లు, పేగులు స్వాధీనం చేసుకున్నారు. దస్నాపూర్‌కు చెందిన చిడెం బానయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు రేంజర్ అప్పలకొండ తెలిపారు. నీల్గాయిని హతమార్చిన మరి కొందరు పరారీలో ఉన్నారు. -
నీల్గాయిపై కుక్కల దాడి..
- రక్షించిన గ్రామస్తులు మెదక్ దాహార్తి తీర్చుకునేందుకు వచ్చిన నీల్గాయిపై కుక్కల మంద దాడి చేసిన ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్‌లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఓ నీల్గాయి(మనుబోతు) దాహార్తి తీర్చుకునేందుకు వ చ్చింది. దానిపై వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటన గమనించిన గ్రామస్తులు కుక్కల దాడి నుంచి నీల్గాయ్ ను కాపాడారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. గ్రామానికి వచ్చిన అటవీ అధికారులకు నీల్గాయ్ ని అప్పగించారు.