లక్ష్మణ్(ఫైల్)
బోథ్: అటవీ అధికారులు ఆ ఐదెకరాలు స్వాధీనం చేసుకుని కుంట నిర్మాణం చేపట్టడంతో మనస్తాపం చెందిన ఆదివాసీ రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జీడిపల్లికి చెందిన లక్ష్మణ్ (48) ఐదెకరాల్లో పోడు వ్యవసాయం చేస్తున్నాడు.
పోడుభూ ములకు పట్టాలిచ్చే కార్యక్రమంలో ఇటీవలే దరఖాస్తు చేసుకున్నాడు. ఆదివారం లక్ష్మణ్‌కు చెందిన భూమిలో అటవీ అధికారులు నీటికుంట నిర్మించడానికి ప్రొక్లెయిన్‌తో వెళ్లారు. ఆవేదనకు గురైన లక్ష్మణ్ ఇంటి నుంచి పురుగుమందు తీసుకుని చేను వద్దకు వెళ్లాడు. తన భూమిలో నీటికుంట నిర్మాణం చేపట్టవద్దని వేడుకున్నాడు.
అయినా అధికారులు పనులు ఆపకపోవడంతో మనస్తాపానికి గురైన లక్ష్మణ్ పురుగుమందు తాగాడు. పక్కనున్నవారు గమనించి ఆయనను బోథ్ ఆస్పత్రికి, ఆపై ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించినా పరిస్థితి విషమించి మృతి చెందాడు. లక్ష్మణ్‌కు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. కాగా, లక్ష్మణ్ రాగానే పనులు ఆపేశామని బోథ్ అటవీ క్షేత్ర అధికారి సత్యనారాయణ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment