
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయి అటవీ అధికారులు, సిబ్బందికి మద్దతునిచ్చి, భరోసా కల్పించాలని పోలీసు అధికారులకు డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. తమ పరిధిలోని చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లా అటవీ అధికారులతో సమావేశమై, వారి సమస్యలను పరిష్కరించాలని పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలను డీజీపీ ఆదేశించారు.
పోలీస్ ఉన్నతాధికారులు, ఎస్పీలతో శుక్రవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో అటవీశాఖ, క్షేత్రస్థాయి సిబ్బంది సమస్యలపై డీజీపీ సమీక్షించారు. ఈ సమావేశానికి హాజరైన పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ ఆయా అంశాలను గురించి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment