
సాక్షి, హైదరాబాద్ : మైలార్‌దేవ్‌పల్లి-కాటేదాన్ ప్రధాన రహదారి పక్కన గురువారం గాయాలతో కనిపించిన చిరుత పులిని పట్టుకోవటంలో అటవీ అధికారులు రెండో రోజు కూడా విఫలమయ్యారు. చిరుతను పట్టుకోకుండానే నేటి ఆపరేషన్‌ను ముగించారు. రెండు బోన్లు, మేకలు ఎరగా వేసి, 23 కెమెరాలు, డ్రోన్తో వెతికినా చిరుత ఆచూకీ దొరకలేదు. ఆ మృగం రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ మీదుగా గండిపేట వైపు వెళ్లి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఇంటి బయట పడుకోరాదని పోలీసులు సూచించారు. చిరుత సమాచారం తెలిస్తే డయల్ 100కి సమాచారం ఇవ్వాలని కోరారు. (లారీ డ్రైవర్ అత్యుత్సాహం; చిరుత దాడి)
నిన్న జూపార్కుకు 3 కిలోమీటర్ల దూరంలో చిరుత గంట సేపు రోడ్డుపైనే ఉండగా.. అటవీ అధికారులకు ఉదయం 7.45కి సమాచారం అందించినా వారు 10 గంటలకు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు ఆలస్యం చేయటం వల్లే చిరుత చిక్కలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే చిరుత ఆచూకీ కోసం మరో రోజు గాలిస్తామని అటవీ అధికారులు చెబుతుండటం గమనార్హం.
చదవండి : (చిరుత కలకలం : రంగంలోకి కుక్కలు)