resque operations
-
రెండు బోన్లు, మేకలు, 23 కెమెరాలు, డ్రోన్
సాక్షి, హైదరాబాద్ : మైలార్‌దేవ్‌పల్లి-కాటేదాన్ ప్రధాన రహదారి పక్కన గురువారం గాయాలతో కనిపించిన చిరుత పులిని పట్టుకోవటంలో అటవీ అధికారులు రెండో రోజు కూడా విఫలమయ్యారు. చిరుతను పట్టుకోకుండానే నేటి ఆపరేషన్‌ను ముగించారు. రెండు బోన్లు, మేకలు ఎరగా వేసి, 23 కెమెరాలు, డ్రోన్‌తో వెతికినా చిరుత ఆచూకీ దొరకలేదు. ఆ మృగం రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ మీదుగా గండిపేట వైపు వెళ్లి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఇంటి బయట పడుకోరాదని పోలీసులు సూచించారు. చిరుత సమాచారం తెలిస్తే డయల్ 100కి సమాచారం ఇవ్వాలని కోరారు. (లారీ డ్రైవర్ అత్యుత్సాహం; చిరుత దాడి) నిన్న జూపార్కుకు 3 కిలోమీటర్ల దూరంలో చిరుత గంట సేపు రోడ్డుపైనే ఉండగా.. అటవీ అధికారులకు ఉదయం 7.45కి సమాచారం అందించినా వారు 10 గంటలకు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు ఆలస్యం చేయటం వల్లే చిరుత చిక్కలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే చిరుత ఆచూకీ కోసం మరో రోజు గాలిస్తామని అటవీ అధికారులు చెబుతుండటం గమనార్హం. చదవండి : (చిరుత కలకలం : రంగంలోకి కుక్కలు) -
లాంచీ ప్రమాదం: ఐదవ రోజుకు రెస్క్యూ ఆపరేషన్
సాక్షి, తూర్పు గోదావరి : ఐదవ రోజు గోదావరి నదిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గురువారం ఎదుర్లంక వద్ద పరశవేది కృష్ణ మోహన్ అనే వ్యక్తి మృతదేహం లభించింది. మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కృష్ణ మోహన్ ధరించిన ఎరుపు రంగు టీ షర్ట్ చూసి భార్య, బంధువులు అతడ్ని గుర్తుపట్టారు. ఆదివారం ఉదయం గణేష్ నిమజ్జనమంటూ కొవ్వూరులోని తమ ఇంటి నుండి బయలు దేరాడని భార్య పూర్ణిమ కన్నీరు పెట్టుకుంది. ఇప్పటివరకు మొత్తం 35 మృతదేహాలను బృందాలు వెలికితీశాయి. మిగిలిన 17 మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, నేవీ, అగ్నిమాపక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గోదావరిలో 250 అడుగుల లోతులో ఉన్న లాంచీని సైడ్ స్కాన్ సోనర్ సహాయంతో గుర్తించారు. లాంచీని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ముంబైకి చెందిన నిపుణుల బృందం ప్రయత్నిస్తోంది. -
ముంచుకొస్తే.. ముందుంటారు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సంభవించిన విపత్తుల నివారణలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) కీలక పాత్ర పోషిస్తోంది. గత రెండు రోజుల క్రితం ఈదురు గాలులతో కూడిన ఆకస్మిక వర్షాలకు కూలిన 630 చెట్లను రికార్డ్ స్థాయిలో తొలగించడం, రోడ్లపై ఏర్పడిన నీటిని తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చేయడంతో పాటు కూలిన విద్యుత్ స్తంభాలు, ఎల్బీ స్టేడియంలోని ఫ్లడ్ లైట్ టవర్‌ను తొలగించడం వంటి చర్యల ద్వారా జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ దేశంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లకు ఆదర్శంగా నిలిచింది. ముంబాయి మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత విపత్తుల నిర్వహణకు ప్రత్యేక విభాగం కేవలం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోనే ఏర్పాటైంది. దాదాపు 220 మంది సిబ్బందితో 8 బృందాలు నగరంలోని 24 కీలక ప్రాంతాల్లో మూడు షిఫ్ట్‌లుగా విధి నిర్వహణలో ఉంటాయి. ఈ నెల 22న అరగంట వ్యవధిలోనే 70 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన అకస్మిక వర్షం కురియడంతో నగర జీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో కీలక ప్రాంతాల్లో ఉన్న విపత్తుల నివారణ బృందాలు రంగంలోకి దిగి రోడ్లపై పడిన చెట్లను, తెగిపడిన విద్యుత్ తీగలు, స్తంభాలను వెంటనే తొలగించాయి. ఈ వర్షాల సందర్భంగా జీహెచ్ఎంసీ ఈవీడీఎం కంట్రోల్ రూంకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 130కి పైగా ఫిర్యాదులు అం దాయి. ఈ ఫిర్యాదులన్నింటినీ 36 గంటల్లోనే పరిష్కరించడంతో పాటు దాదాపు 622 కూలిన చెట్లను తొలగించారు. మచ్చుకు కొన్ని.. ♦ రామంతాపూర్‌లోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఉన్న పెద్ద రావిచెట్టు కూలింది. అత్యంత పురాతన ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం పైన, గుడిపైన చెట్ల కొమ్మలు పడకుండా అత్యంత జాగ్రత్తగా కూలిన వక్షాన్ని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు తొలగించాయి. ♦ ఆడిక్‌మెట్ రామాలయంలో ఉన్న 40 ఏళ్ల చెట్టు సైతం కూలడం, ఈ కూలిన వృక్షాన్ని దేవాలయానికి గానీ, పరిసర ప్రాంతాల ఇళ్లపై కానీ పడకుండా సురక్షితంగా తొలగించారు. ♦ లక్డికాపూల్‌లోని కేన్సర్ ఆసుపత్రి వద్ద భారీ వృక్షం కూలి రెండు ప్రధాన రహదారులను బ్లాక్ చేయడంతో ఫిర్యాదును అందుకున్న వెంటనే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఘటనా స్థలానికి చేరుకొని అతితక్కువ సమయంలో కూలిన చెట్లను తొలగించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేశారు. సుశిక్షితులైన టీం జీహెచ్ఎంసీలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటై కేవలం సంవత్సర కాలంలోనే ఈ విభాగంలోని 220 మంది సిబ్బందికి విపత్తుల నిర్వహణలో సుశిక్తులుగా చేయడంతో నగరంలో ఏవిధమైన విపత్తులు సంభవించినా సమర్థవంతంగా ఎదుర్కునే ఫోర్స్ జీహెచ్ఎంసీ కలిగి ఉందని ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు. విపత్తులను ఎదుర్కోవడానికి కావాల్సిన అత్యాధునిక మిషనరీ, టూల్స్‌లను కూడా సేకరించుకోవడం జరిగిందని, ఈ విపత్తు నివారణ బంద సభ్యుల భద్రతకు కూడా అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్టు విశ్వజిత్ తెలియజేశారు. హైదరాబాద్ నగరంలో ఎలాంటి సంఘటనలైనా ఎదుర్కునేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిద్ధంగా ఉందనే ధైర్యం నగరవాసుల్లో ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా 22న ఏర్పడిన భారీ వర్షాలకు డి.ఆర్.ఎఫ్ బందాలు అందించిన సేవలపై పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజానీకం ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సప్ తదితర సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రశంసలు కురిపించారు. -
చిరుజల్లుల్లో సహాయక చర్యలు
క్షేత్రస్థాయిలో మంత్రి హరీశ్‌రావు పరిశీలన యంత్రాంగానికి సూచనలు, ఆదేశాలు రెండోరోజు సిద్దిపేటలో బిజీబిజీ సిద్దిపేట జోన్: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వరద నీరు పోటెత్తుతున్న క్రమంలో సహాయక చర్యలను వేగవంతం చేసే దిశగా రాష్ర్ట భారీనీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు రెండవ రోజు ఆదివారం సిద్దిపేటలో బిజీబీజీగా గడిపారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తూ అప్పటికప్పుడు సహాయక చర్యలను వేగవంతం చేసే దిశగా అధికార యంత్రాంగానికి సూచనలు, ఉన్నతాధికారులకు ఆదేశాలను ఇస్తూ వరద ప్రవాహంతో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పటిష్ట చర్యలను చేపట్టారు. ముందుగా స్థానిక కోమటి చెరువును మంత్రి సందర్శించి అక్కడ చెరువు నుంచి 24 గంటలుగా ప్రవహిస్తున్న వరదనీటి మత్తడి ప్రవాహాన్ని పరిశీలించారు. ఎగువ భాగం నుంచి వరదనీరు కోమటి చెరువులోకి పెద్ద ఎత్తున చెరుకోవడంతో ముందు జాగ్రత్తగా నీటిని దిగువ భాగంలోని నర్సాపూర్, రాజగోపాల్‌పేట చెరువులకు మత్తడి రూపంలో మళ్లించారు. ఈ ప్రక్రియను మంత్రి నీటి పారుదల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో కోమటి చెరువు వద్ద ఆరా తీశారు. ఒక దశలో చెరువు కట్టకు ఒక పక్క కోత ఏర్పడిన క్రమంలో మంత్రి దగ్గరుండి సుమారు వెయ్యి ఇసుక బస్తాలతో మరమ్మతు పనులు వేగవంతం చేశారు. అనంతరం కోమటి చెరువు ఫీడర్ చానల్ ప్రవాహం వెంట అధికార యంత్రాంగంతో పరిశీలించారు. పట్టణంలోని హైదరాబాద్ బ్రిడ్జిని సందర్శించి అక్కడ నిలిచిన వరద నీటిని మళ్లించే చర్యలను వేగవంతం చేస్తూ స్థానికులకు ఇబ్బంది కలుగకుండా బావిస్ఖానా పూల్ గేట్లను ఎత్తివేయించారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు, తీవ్ర నీటి ఉధృతిపై చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో ఆరా తీశారు. ప్రజలతో మమేకమై .... కోమటి చెరువు మత్తడి ప్రవాహాన్ని రెండవ రోజు మంత్రి హరీశ్‌రావు పరిశీలిస్తున్న క్రమంలో చెరువు కట్టపై పెద్ద ఎత్తున చేరిన ప్రజలతో ఆయన మమేకమై అప్యాయంగా పలకరించారు. దశాబ్ద కాలం తర్వాత సిద్దిపేట కోమటి చెరువు మత్తడి పారడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రితో ఆనందాన్ని పంచుకున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు చెరువు వద్దకు చేరడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో చెరువును పర్యాటక క్షేత్రంగా మార్చే క్రమంలో భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసేందుకు ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.నీటి ప్రవాహాన్ని, చెరువును తిలకించడానికి వచ్చిన చిన్న, పెద్ద తేడా లేకుండా మంత్రి హరీశ్‌రావు చెరువు మత్తిడిపై వారి మనోభిప్రాయాలు తెలుసుకున్నారు. మంత్రి వెంట నీటి పారుదల శాఖ ఈఈ రవీందర్‌రెడ్డి, విద్యుత్ శాఖ డీఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్పీ షేక్‌లాల్ ఆహ్మద్ , మంత్రి ఓఎస్డీ బాల్‌రాజు, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అక్తర్, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మారెడ్డి రవీందర్‌రెడ్డి, లోక లక్ష్మిరాజం, పాలసాయిరాం, బ్రహ్మం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.