సాక్షి, తూర్పు గోదావరి : ఐదవ రోజు గోదావరి నదిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గురువారం ఎదుర్లంక వద్ద పరశవేది కృష్ణ మోహన్ అనే వ్యక్తి మృతదేహం లభించింది. మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కృష్ణ మోహన్ ధరించిన ఎరుపు రంగు టీ షర్ట్ చూసి భార్య, బంధువులు అతడ్ని గుర్తుపట్టారు. ఆదివారం ఉదయం గణేష్ నిమజ్జనమంటూ కొవ్వూరులోని తమ ఇంటి నుండి బయలు దేరాడని భార్య పూర్ణిమ కన్నీరు పెట్టుకుంది.
ఇప్పటివరకు మొత్తం 35 మృతదేహాలను బృందాలు వెలికితీశాయి. మిగిలిన 17 మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్, నేవీ, అగ్నిమాపక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గోదావరిలో 250 అడుగుల లోతులో ఉన్న లాంచీని సైడ్ స్కాన్ సోనర్ సహాయంతో గుర్తించారు. లాంచీని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ముంబైకి చెందిన నిపుణుల బృందం ప్రయత్నిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment