సాక్షి, హైదరాబాద్: ప్రత్యక్ష క్లాసులతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుట పడుతున్నాయని భావిస్తున్న సమయంలో, ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యారంగ నిపుణులు, సీనియర్ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. వీలైనంత వరకు పాఠాల పునఃశ్చరణకు ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.
ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి ఇవి సర్వ సాధారణమే అయినప్పటికీ, ప్రస్తుత ప్రత్యేక పరిస్థి తుల్లో ఇన్ని రోజుల సెలవులపై తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన కన్పిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కరోనా థర్డ్‌వేవ్‌తో స్కూళ్లు మూతపడుతున్నాయి. దీంతో సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో యథావిధిగా స్కూళ్లు నడుస్తాయా? అనే సందేహాలు వ్యక్తమవు తున్నాయి.
గడచిన రెండేళ్ళుగా కరోనా నేపథ్యంలో విద్యా సంస్థ లన్నీ మూతపడ్డాయి. ఫలితంగా విద్యా ర్థులు పెద్ద మొత్తంలో లెర్నింగ్ లాసెస్ (అభ్యసన నష్టాలు) ఎదుర్కొంటున్నారు. 41 శాతం మందిలో రాత నైపు ణ్యం, 34 మందిలో చదివే సామర్థ్యం, 51 శాతానికి పైగా ఇంగ్లీష్ భాషపై పట్టు పోయిందని ఇటీవలి సర్వేలు పేర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ స్కూళ్లు మూతపడితే విద్యార్థుల పరిస్థితి ఏమి టనే ఆందో ళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల చదువుపై ప్రత్యేకంగా దృష్టి సారించా ల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎవరి ప్రణాళిక వారిది?
♦సెలవుల్లో విద్యార్థి చదువు స్పృహ నుంచి పక్క దారి పట్టకుండా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. కరోనా నేపథ్యంలో సంక్రాంతిని ఉమ్మడిగా ఆస్వాదించే అవకాశం కూడా లేదు కాబట్టి, విద్యార్థులు చదువుపైనే దృష్టి కేంద్రీకరించేలా చూడాలని భావిస్తున్నాయి.
♦ప్రైవేటు స్కూళ్ళల్లో విద్యార్థులను మళ్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్‌కు కనెక్ట్ చేసే (ఆన్‌లైన్ పాఠాలు) ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం, హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి వంటి జిల్లాల్లోని కొన్ని ప్రైవేటు స్కూళ్ళు ఈ దిశగా ప్రణాళికలు సిద్ధం చేశాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు దీనిపై అవగాహన కల్పిస్తున్నాయి.
♦ఇప్పటివరకు జరిగిన పాఠాల్లో విద్యార్థులు ఆసక్తిగా వినలేదని భావించే సబ్జెక్టులపై ప్రత్యేక క్లాసులు (పునఃశ్చరణ) నిర్వహించాలని నిర్ణయించినట్టు కొన్ని స్కూళ్ళ నిర్వాహకులు తెలిపారు. వీటితో పాటు ఆన్‌లైన్ ద్వారా ప్రతిరోజూ విద్యార్థులకు క్విజ్, పజిల్స్, జనరల్ నాలెడ్జ్, పాఠ్యాంశాల్లోంచే సంక్షిప్త ప్రశ్నలు అడిగేలా ప్లాన్ చేసినట్టు ప్రైవేటు విద్యా సంస్థలు కొన్ని తెలిపాయి.
♦ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను త్రీడీ యానిమేషన్‌తో అందించేందుకు ఖమ్మంలోని ఓ ప్రైవేటు స్కూలు ప్రయత్నాలు మొదలు పెట్టింది. సైన్స్ సబ్జెక్టులో ఇప్పటివరకు చెప్పిన ఖగోళ, మొక్కలు, మానవ అవయవ నిర్మాణం తదితర అంశాలు త్రీడీ ద్వారా అర్థమయ్యేలా ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు వివరించాలని భావిస్తున్నారు.
♦ఇక ప్రభుత్వ పాఠశాలల్లోనూ సెలవు దినాల్లో ప్రత్యేక హోంవర్క్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని మహబూబ్‌నగర్‌కు చెందిన ప్రధానోపాధ్యాయుడు రవికాంత్ తెలిపారు. ఇప్పటికే ఎస్‌ఏ–1 పరీక్ష పూర్తి చేశాం. కాబట్టి పిల్లలకు పరీక్షల భయం లేదు. కాకపోతే విద్యా సంవత్సరం ఆలస్యంగా మొదలవ్వడం, ఇప్పుడిప్పుడే సిలబస్ ముందుకెళ్ళడం జరుగుతోందని ఉపాధ్యాయులు అంటున్నారు. వాటిని మరిచి పోకుండా ఉండేందుకు ప్రణాళిక బద్ధంగా హోంవర్క్ ఇస్తున్నట్టు చెబుతున్నారు.
విద్యార్థుల మూడ్‌కనుగుణంగా బోధన
సెలవుల్లో విద్యార్థులు సాధారణంగా మానసికోల్లాసాన్ని కోరుకుంటారు. అలాంటప్పుడు మళ్లీ చదువు, పాఠాలంటే విసుగుకరంగా భావించే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఆసక్తి కలిగించే రీతిలో విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. దీనికోసం మేం డిజిటల్ ప్లాట్ ఫామ్‌ను వాడుతున్నాం. క్విజ్, పజిల్స్‌తో పాటు సిలబస్‌లోని పాఠాలు మరిచిపోకుండా ప్రాక్టికల్‌గా త్రీడీ యానిమేషన్‌తో అందించేందుకు విద్యార్థులను సంసిద్ధులను చేశాం. సెలవుల్లో విద్యార్థి మేథోశక్తికి పదును పెట్టకపోతే దాని ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది.
– ఆర్ పార్వతీ రెడ్డి, హార్వెస్ట్ స్కూల్ ప్రిన్సిపాల్, ఖమ్మం
బడి మరిచిపోకుండా హోం వర్క్
సెలవుల్లోనూ విద్యార్థి బడిని, చెప్పిన పాఠాన్ని మరిచిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. స్కూల్ నుంచైతే కొంత హోం వర్క్ ఇస్తున్నాం. దీన్ని ఫాలో అయితే ఫైనల్ పరీక్షల్లో విద్యార్థి చురుకుదనం పెరుగుతుంది. ఇచ్చిన హోం వర్క్ పూర్తి చేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. రోజూ కొంత సేపైనా పుస్తకాలు పఠించేలా ప్రోత్సహించాలి.
– పరాంకుశం రాజా భానుప్రకాశ్, హెచ్‌ఎం, ఎల్ అండ్ ఎం ప్రభుత్వ పాఠశాల, కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment