holidays plan
-
సెలవుల్లోనూ ‘స్టడీ’గా.. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, హైదరాబాద్: ప్రత్యక్ష క్లాసులతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుట పడుతున్నాయని భావిస్తున్న సమయంలో, ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యారంగ నిపుణులు, సీనియర్ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. వీలైనంత వరకు పాఠాల పునఃశ్చరణకు ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి ఇవి సర్వ సాధారణమే అయినప్పటికీ, ప్రస్తుత ప్రత్యేక పరిస్థి తుల్లో ఇన్ని రోజుల సెలవులపై తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన కన్పిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కరోనా థర్డ్‌వేవ్‌తో స్కూళ్లు మూతపడుతున్నాయి. దీంతో సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో యథావిధిగా స్కూళ్లు నడుస్తాయా? అనే సందేహాలు వ్యక్తమవు తున్నాయి. గడచిన రెండేళ్ళుగా కరోనా నేపథ్యంలో విద్యా సంస్థ లన్నీ మూతపడ్డాయి. ఫలితంగా విద్యా ర్థులు పెద్ద మొత్తంలో లెర్నింగ్ లాసెస్ (అభ్యసన నష్టాలు) ఎదుర్కొంటున్నారు. 41 శాతం మందిలో రాత నైపు ణ్యం, 34 మందిలో చదివే సామర్థ్యం, 51 శాతానికి పైగా ఇంగ్లీష్ భాషపై పట్టు పోయిందని ఇటీవలి సర్వేలు పేర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ స్కూళ్లు మూతపడితే విద్యార్థుల పరిస్థితి ఏమి టనే ఆందో ళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల చదువుపై ప్రత్యేకంగా దృష్టి సారించా ల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎవరి ప్రణాళిక వారిది? ♦సెలవుల్లో విద్యార్థి చదువు స్పృహ నుంచి పక్క దారి పట్టకుండా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. కరోనా నేపథ్యంలో సంక్రాంతిని ఉమ్మడిగా ఆస్వాదించే అవకాశం కూడా లేదు కాబట్టి, విద్యార్థులు చదువుపైనే దృష్టి కేంద్రీకరించేలా చూడాలని భావిస్తున్నాయి. ♦ప్రైవేటు స్కూళ్ళల్లో విద్యార్థులను మళ్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్‌కు కనెక్ట్ చేసే (ఆన్లైన్ పాఠాలు) ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం, హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి వంటి జిల్లాల్లోని కొన్ని ప్రైవేటు స్కూళ్ళు ఈ దిశగా ప్రణాళికలు సిద్ధం చేశాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు దీనిపై అవగాహన కల్పిస్తున్నాయి. ♦ఇప్పటివరకు జరిగిన పాఠాల్లో విద్యార్థులు ఆసక్తిగా వినలేదని భావించే సబ్జెక్టులపై ప్రత్యేక క్లాసులు (పునఃశ్చరణ) నిర్వహించాలని నిర్ణయించినట్టు కొన్ని స్కూళ్ళ నిర్వాహకులు తెలిపారు. వీటితో పాటు ఆన్లైన్ ద్వారా ప్రతిరోజూ విద్యార్థులకు క్విజ్, పజిల్స్, జనరల్ నాలెడ్జ్, పాఠ్యాంశాల్లోంచే సంక్షిప్త ప్రశ్నలు అడిగేలా ప్లాన్ చేసినట్టు ప్రైవేటు విద్యా సంస్థలు కొన్ని తెలిపాయి. ♦ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను త్రీడీ యానిమేషన్‌తో అందించేందుకు ఖమ్మంలోని ఓ ప్రైవేటు స్కూలు ప్రయత్నాలు మొదలు పెట్టింది. సైన్స్ సబ్జెక్టులో ఇప్పటివరకు చెప్పిన ఖగోళ, మొక్కలు, మానవ అవయవ నిర్మాణం తదితర అంశాలు త్రీడీ ద్వారా అర్థమయ్యేలా ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు వివరించాలని భావిస్తున్నారు. ♦ఇక ప్రభుత్వ పాఠశాలల్లోనూ సెలవు దినాల్లో ప్రత్యేక హోంవర్క్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని మహబూబ్‌నగర్‌కు చెందిన ప్రధానోపాధ్యాయుడు రవికాంత్ తెలిపారు. ఇప్పటికే ఎస్ఏ–1 పరీక్ష పూర్తి చేశాం. కాబట్టి పిల్లలకు పరీక్షల భయం లేదు. కాకపోతే విద్యా సంవత్సరం ఆలస్యంగా మొదలవ్వడం, ఇప్పుడిప్పుడే సిలబస్ ముందుకెళ్ళడం జరుగుతోందని ఉపాధ్యాయులు అంటున్నారు. వాటిని మరిచి పోకుండా ఉండేందుకు ప్రణాళిక బద్ధంగా హోంవర్క్ ఇస్తున్నట్టు చెబుతున్నారు. విద్యార్థుల మూడ్‌కనుగుణంగా బోధన సెలవుల్లో విద్యార్థులు సాధారణంగా మానసికోల్లాసాన్ని కోరుకుంటారు. అలాంటప్పుడు మళ్లీ చదువు, పాఠాలంటే విసుగుకరంగా భావించే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఆసక్తి కలిగించే రీతిలో విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. దీనికోసం మేం డిజిటల్ ప్లాట్ ఫామ్‌ను వాడుతున్నాం. క్విజ్, పజిల్స్‌తో పాటు సిలబస్‌లోని పాఠాలు మరిచిపోకుండా ప్రాక్టికల్‌గా త్రీడీ యానిమేషన్‌తో అందించేందుకు విద్యార్థులను సంసిద్ధులను చేశాం. సెలవుల్లో విద్యార్థి మేథోశక్తికి పదును పెట్టకపోతే దాని ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది. – ఆర్ పార్వతీ రెడ్డి, హార్వెస్ట్ స్కూల్ ప్రిన్సిపాల్, ఖమ్మం బడి మరిచిపోకుండా హోం వర్క్ సెలవుల్లోనూ విద్యార్థి బడిని, చెప్పిన పాఠాన్ని మరిచిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. స్కూల్ నుంచైతే కొంత హోం వర్క్ ఇస్తున్నాం. దీన్ని ఫాలో అయితే ఫైనల్ పరీక్షల్లో విద్యార్థి చురుకుదనం పెరుగుతుంది. ఇచ్చిన హోం వర్క్ పూర్తి చేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. రోజూ కొంత సేపైనా పుస్తకాలు పఠించేలా ప్రోత్సహించాలి. – పరాంకుశం రాజా భానుప్రకాశ్, హెచ్ఎం, ఎల్ అండ్ ఎం ప్రభుత్వ పాఠశాల, కరీంనగర్ -
చలో టూర్..
సాక్షి, సిటీబ్యూరో: ఒకవైపు పవిత్ర కార్తీకమాసం. మరోవైపు వీకెండ్ వరుస సెలవులు. దానికి తోడు ఆహ్లాదకరమైన శీతాకాలం. మరింకేం. అన్నీ కలిసొచ్చాయి. దీంతో నగర వాసులు సొంత ఊళ్లకు, పర్యాటకస్థలాలకు పయనమవుతున్నారు. నాలుగు రోజులు సరదాగా గడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. గురువారం నుంచే వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, బస్సుల్లో రద్దీ కనిపించింది. అన్ని రెగ్యులర్ రైళ్లలో వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరుకుంది. శుక్రవారం ప్రయాణికుల రద్దీ మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ, రైల్వే అధికారుల అంచనా. వరుస సెలవులను దృష్టిలో ఉంచుకొని పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. విజ్ఞాన, విహార యాత్రలకు వెళ్లే విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ఉత్తర, దక్షిణాది పర్యటనలకు తరలి వెళ్తున్నారు. మరి కొందరు పర్యాటక ప్రియులు శ్రీలంక, థాయ్‌లాండ్, దుబాయ్ వంటి విదేశాలకు స్వల్ప కాలిక టూర్లకు వెళ్తున్నారు. పర్యాటకుల అభిరుచికి తగిన ట్లుగా ఐఆర్సీటీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే పలు ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చాయి. దీంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య కొద్దిగా పెరిగినట్లు విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా కార్తీక మాసంతో పాటు సెలవులు కూడా కలిసి రావడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు, సందర్శకుల సంఖ్య ఇతోధికంగా పెరిగింది. సుమారు 17 శాతం వరకు దేశీయ ప్రయాణాలు పెరిగినట్లు కాక్స్ అండ్ కింగ్స్ ట్రావెల్ సంస్థ పేర్కొంది. పర్యాటకుల అభిరుచి మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు సైతం ప్రత్యేక ప్యాకేజీలతో ఆకట్టుకుంటున్నాయి. ఉత్తరాదికి పెరిగిన రద్దీ... చాలామంది నగరవాసులు, విద్యార్థులు ఉత్తరాదికి వెళ్లేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా ఢిల్లీ, జైపూర్, పట్నా, వారణాసి, తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో రద్దీ పెరిగినట్లు రైల్వే అధికారి ఒకరు పేర్కొన్నారు. ‘ వారణానికి వెళ్లే వారిలో ఎక్కువ శాతం ఆధ్మాత్మిక పర్యాటకులు ఉండగా, జైపూర్, తదితర ప్రాంతాలకు వెళ్లే వారిలో టూరిస్టులు, విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వెళ్లే పట్నా ఎక్స్‌ప్రెస్, దాణాపూర్, రాజ్‌కోట్, తదితర రైళ్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఈ రైళ్లలో నెల రోజుల క్రితమే బెర్తులు పూర్తిగా రిజర్వు చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం అన్ని రైళ్లలోనూ చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ దర్శనమిస్తోంది. కార్తీక మాసం సందర్భంగా తుంగభద్రలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఎక్కువ మంది కర్నూలు తరలి వెళ్తున్నారు. అలాగే రాజమండ్రికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. విజయవాడ, విశాఖ, కాకినాడ, తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు ముందస్తుగానే బుక్ అయ్యాయి. శుక్ర, శని వారాల్లో రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. పంచారామాలకు ఆర్టీసీ ప్యాకేజీ... తెలంగాణలోని పంచ శైవక్షేత్రాలైన వేముల వాడ (రాజరాజేశ్వరాలయం), కాళేశ్వర (ముక్తేశ్వర, కాళేశ్వర స్వామి), రామప్పగుడి (రామలింగేశ్వర స్వామి) వెయి స్తంభాలగుడి (రుద్రేశ్వర స్వామి), పాలకుర్తి (సోమనాథ స్వామి), ఏపీలోని అమరావతి (అమరేశ్వరాలయం), భీమవరం (సోమేశ్వరాలయం), పాలకొల్లు (క్షీరరామలింగేశ్వరాలయం), ద్రాక్షారామం (భీమేశ్వరాలయం), సామర్లకోట (కుమార రామ భీమేశ్వరాలయం)లకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. తెలంగాణలోని దక్కన్ పంచ శైవక్షేత్రాలకు కార్తీక పౌర్ణమి ముందు రోజు ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. అలాగే ప్రతి ఆదివారం మధ్యాహ్నం బయలుదేరి సోమవారం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ పర్యటను చార్జీ సూపర్‌లగ్జరీ రూ.1100, రాజధాని రూ.1500 చొప్పున ఉంది. ఏపీలోని పంచారామాలకు కూడా కార్తీక పౌర్ణమి ముందు రోజు బస్సులు బయలుదేరుతాయి. ఈ పర్యటనకు సూపర్‌లగ్జరీ చార్జీ రూ.1800 కాగా, రాజధాని చార్జీ రూ.2450 చొప్పున ఉంది. దర్శనం టిక్కెట్లు, స్నాన వసతి కోసం మరో రూ.300 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అలాగే కార్తీక మాసంలో ప్రతి ఆదివారం బయలుదేరి మంగళవారం తిరిగి హైదరాబాద్ చేరుకొనేలా ఈ బస్సులను ఏర్పాటు చేశారు. -
ఈ ఏడాది.. సెలవులే సెలవులు!
గత సంవత్సరం దీపావళి, గాంధీ జయంతి, క్రిస్మస్.. ఇలాంటివన్నీ ఆదివారాలే రావడంతో ఉద్యోగాలు చేసుకునేవాళ్లు చాలా నీరసపడ్డారు. సెలవుల్నీ వృథా అయిపోయాయని తెగ బాధపడిపోయారు. అలాంటివాళ్లకు 2017 పండుగ తీసుకొస్తోంది. ఈ సంవత్సరం ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 12 లాం....గ్ వీకెండ్లు వచ్చాయట! మధ్యలో ఒక్కరోజు సెలవు పెట్టుకుంటే వరుసగా నాలుగు రోజులు ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేసి రావడానికి బోలెడంత అవకాశం ఉందట. సగటున ప్రతి నెలకు ఒక లాంగ్ వీకెండ్ వచ్చిందని ట్రావెలింగ్ సంస్థల వాళ్లు చెబుతున్నారు. ఇప్పటికే పలు ఎయిర్‌లైన్స్ సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు వెల్లువెత్తిస్తున్నాయి. ఈనెల 22వ తేదీ లోపు బుక్ చేసుకుంటే 99 రూపాయల బేస్ఫేర్కే గోవా లాంటి ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి విమాన టికెట్లు అందిస్తామని ఎయిర్ ఏషియా ప్రకటించింది. జనవరి 26వ తేదీ గురువారం. మధ్యలో శుక్రవారం సెలవు పెట్టుకుంటే నాలుగు రోజులు సెలవులు. ఇలాంటివి ఏడాది పొడవునా ఏవేం ఉన్నాయో ఒక్కసారి చూసుకుంటే ముందుగానే ప్లాన్ చేసుకుని తక్కువ ధరలతోనే విమానయానం చేయడంతో పాటు సరదాగా నాలుగైదు రోజులు ఎక్కడైనా గడిపి రావచ్చని సూచిస్తున్నారు. ఫిబ్రవరి 24 శుక్రవారం మహాశివరాత్రి వచ్చింది. మార్చి 29 బుధవారం ఉగాది అయ్యింది. సోమ, మంగళవారాలు సెలవు తీసుకుంటే ఐదు రోజుల హాలిడే ఎంజాయ్ చేసి రావచ్చు. ఏప్రిల్ 14 శుక్రవారం గుడ్ ఫ్రైడే, అంబేద్కర్ జయంతి ఉన్నాయి. మే 1 మేడే సోమవారం వచ్చింది. రంజాన్ జూన్ 26 సోమవారం కావొచ్చని అంటున్నారు. ఆగస్టు 15 మంగళవారం వచ్చింది. అదేరోజు కృష్ణాష్టమి కూడా. అదే నెలలో 25వ తేదీ వినాయక చవితి శుక్రవారం వచ్చింది. అంటే ఒకే నెలలో రెండు లాంగ్ వీకెండ్లు అన్న మాట. అక్టోబర్ 2 గాంధీ జయంతి సోమవారం. అదేనెల 19వ తేదీ దీపావళి గురువారం. డిసెంబర్ 25 క్రిస్మస్ సోమవారం వచ్చింది. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన కొన్ని ట్రావెల్స్ సంస్థలు వీకెండ్ హాలిడే ఆఫర్లు అంటూ ముందుగానే ప్రకటిస్తున్నాయి. జనవరి 26వ తేదీ గురువారం కావడంతో శుక్రవారం సెలవు పెట్టేవాళ్లు చాలామంది ఉన్నారని, ఈ వీకెండ్ ప్లాన్ల కోసం ఎంక్వైరీ చేసేవాళ్లు 25 శాతం పెరిగారని ఓ ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి చెప్పారు. వాళ్లలో 60 శాతం మంది స్వదేశంలోని డెస్టినేషన్లనే చూసుకుంటుండగా, మిగిలినవాళ్లు మాత్రం దగ్గర్లోని విదేశాలకు కూడా వెళ్దామని చూస్తున్నారు. చాలామంది ఇప్పుడు రోడ్ జర్నీ కంటే విమానాల్లో వెళ్లడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. కొద్దిగా డబ్బులు ఎక్కువైనా ప్రయాణ సమయం బాగా కలిసొస్తుండటంతో అక్కడ ఎక్కువ సేపు ఎంజాయ్ చేయొచ్చన్న ఆలోచన కనిపిస్తోంది. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి గోవా వెళ్లి రావడానికి ఒక విమానయాన సంస్థ అందిస్తున్న ఆఫర్లో బుక్ చేసుకుంటే రానుపోను కలిపి రూ. 4500 లోపలే అవుతోంది. విడిగా వెళ్లినా దాదాపు అంతే అవుతోంది కాబట్టి ఫ్లైట్ బుక్ చేసుకుందామని కొందరు ప్లాన్ చేస్తున్నారు. ఖతార్, ఎమిరేట్స్, ఎతిహాద్, బ్రిటిష్ ఎయిర్వేస్, మలేషియన్ లాంటి సంస్థలు రూ. 10 వేలకే విదేశాలకు టికెట్లు ఆఫర్ చేస్తున్నాయని మేక్ మై ట్రిప్ ప్రతినిధి చెప్పారు. అందుకే ఈసారి హాలిడేస్ ఎంజాయ్ చేద్దామని అంతా సిద్ధమైపోతున్నారు.