న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లాలోని ఒకే పాఠశాలలో 79 మంది విద్యార్థులకు కరోనా సోకడం ఆ పరిసరాల్లో కలకలం రేపింది. ధరంపూర్ పట్టణంలోని బోర్డింగ్ పాఠశాలలో జరిపిన కరోనా పరీక్షలో ముగ్గురు ఉపాధ్యాయులు, 79 మంది విద్యార్థులకు పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. దీంతో వైద్య అధికారులు వైరస్ సోకిన వారందరిని క్వారంటైన్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ పాఠశాలను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించి అటు వైపు రాకపోకలు నిషేదించారు.
ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల మూసివేతను సెప్టెంబర్ 25 వరకు పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో సెప్టెంబర్ 21 వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో రెసిడెన్షియల్ పాఠశాలలు మినహా అన్ని పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. స్కూళ్లను మూసివేసినప్పటికీ ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ ఉద్యోగులు మాత్రం విధులకు హాజరు కావాలని ఆదేశించింది.
చదవండి: వ్యాక్సిన్ వేసుకోవాలని వెరైటీగా చెప్పి.. అందరినీ ఆకర్షించాడు
Comments
Please login to add a commentAdd a comment