సాక్షి, అమరావతి: ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 67,590 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,539 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 1,140 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1979504 మంది డిశ్చార్జ్ అయ్యారు.
గత 24 గంటల్లో కరోనా బారినపడి చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున 12 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు 13778 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14448 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2007730కి చేరింది. ఏపీలో ఇప్పటివరకు 2,63,37,946 కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇవీ చదవండి:
'బుల్లెట్ బండి' పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఎంపీ
Viral: బుల్లెట్టు బండి పాటొస్తేనే.. పాలు తాగుతోంది!
Comments
Please login to add a commentAdd a comment