
ఢిల్లీ: దేశంలో మళ్లీ రెండు నెలల తర్వాత ఒకేరోజు అత్యధిక కరోనా కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 46, 759 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క కేరళలోనే 32,801 కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,26,49,947కు చేరింది. ఇక శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 509 మంది మరణించగా.. మొత్తం మీద 4,37,370 మంది కరోనాకు బలయ్యారు.
ఇక కరోనా నుంచి 24 గంటల్లో కొత్తగా 31, 374 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,18,52,802గా ఉంది. ఇక దేశంలో 3,59,775 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 62,29,89,134 డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది. ఇందులో గత 24 గంటల్లో కోటీ 3లక్షల 35వేల 290 మందికి వ్యాక్సినేషన్ వేసి రికార్డు సృష్టించినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది.
చదవండి: ఒక్క రోజే కోటి వ్యాక్సినేషన్లు
Comments
Please login to add a commentAdd a comment