
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత మూడు నాలుగు రోజులుగా 40వేల పైన కేసులు నమోదవుతున్నాయి. మహమ్మారి కారణంగా దేశంలో ఇప్పటి వరకు 4 లక్షల మంది మృత్యువాతపడ్డారు. గడచిన 24 గంటల్లో 46,617 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,04,58,251కి చేరింది. గురువారం కోవిడ్‌తో 853 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 4,00,312కు పెరిగింది.
ఈ మేరకు శుక్రవారంవారం కేంద్ర వైద్యారోగ్యశాఖ కోవిడ్‌పై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం 5,09,637 లక్షల యాక్టీవ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే 59,384 మంది కోలుకోగా.. మొత్తం రికవరీలు 2,95,48,302 దాటింది. దేశంలో 97.01 శాతం కరోనా రికవరీ రేటు ఉంది. యాక్టివ్ కేసుల శాతం 1.67 శాతం, మరణాల రేటు 1.31 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 34,00,76,232 మంది వ్యాక్సిన్ చేయించుకున్నారు.
మూడో స్థానంలో భారత్
కోవిడ్‌తో అత్యధికంగా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడోస్థానంలో ఉంది. అగ్రరాజ్యం అమెరికా 6 లక్షల మరణాలతో మొదటి స్థానంలో ఉండగా.. 5.2 మరణాలతో బ్రెజిల్ రెండో స్థానంలో నిలిచింది. భారత్ 4లక్షల మరణాలతో మూడో స్థానంలో ఉండగా.. ఆ తర్వాత నాలుగో స్థానంలో మెక్సిలో ఉంది.
చదవండి:
45 ఏళ్లు పైబడినవారికి 53 % టీకాలు
Banjara Hills: పెళ్లి చేసుకున్నాం.. రక్షణ కల్పించండి
Comments
Please login to add a commentAdd a comment