
ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,164 కరోనా కేసులు నమోదవ్వగా.. 607 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,25,58,530కి చేరగా.. మృతుల సంఖ్య 4,36,365గా ఉంది. ఇక కరోనా నుంచి కొత్తగా 34,159 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,17,88,440 మంది ఉన్నారు. ప్రస్తుతం దేశంలో 3,33,725 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక దేశంలో ఇప్పటివరకు 60, 38, 46, 475 మంది కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారు. కాగా దేశం మొత్తంమీద చూసుకుంటే కేరళలోనే కరోనా కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 31,445 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరగడంలో ఓనం వేడుకలు కారణమని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment