
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,625 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 562 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 36,668 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 4,10,353 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 48.52 కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment