
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,401 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,22,85,857కు చేరింది. గడిచిన 24 గంటల్లో 530 మంది కోవిడ్ బాధితులు మృతి చెందగా.. కరోనా వైరస్ బారినపడి మొత్తం 4,32,519 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక గత 24 గంటల్లో 39,157 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,14,85, 923 మంది ఉన్నారు. దేశంలో ప్రస్తుతం 3,64,129 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో మొత్తం 56.64 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.