సాక్షి, కర్నూల్: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులిటెన్‌ను శనివారం సాయంత్రం విడుదల చేశారు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని చికిత్స అందిస్తున్న వైద్య బృందంలోని డాక్టర్ హితేష్‌రెడ్డి ప్రకటించారు.
‘‘యాంజియోగ్రామ్ చేస్తే రెండు వాల్స్ బ్లాక్ అయినట్లు తేలింది. లక్ష్మమ్మకు చికిత్స చాలా అవసరం. ఆమెకు బీపీ తక్కువగా ఉంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం’’ అని డాక్టర్ హితేష్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. పులివెందులలోని నివాసంలో శుక్రవారం ఉదయం శ్రీలక్ష్మి అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో స్థానికంగా ఓ ఆస్పత్రిలో చేర్పించగా.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో ప్రత్యేక ఆంబులెన్స్‌ను ఆమెను హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మార్గం మధ్యలో ఆమె పరిస్థితి విషమించడంతో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment