
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 39,472 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,71,901కు చేరుకుంది. శుక్రవారం రోజు 535మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 4,20,551కు పెరిగింది.
అదే విధంగా గడిచిన ఒక్కరోజులో 39,972 మంది కరోనా నుంచి కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3,05,43,138 కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,08,212 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 43.31 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్ అందించినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.