
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,47,417 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అయితే బుధవారంతో పోలిస్తే 27 శాతం కోవిడ్ కేసులు అధికంగా పెరిగాయి. దేశంలో 13.11 శాతానికి పాజిటివిటీ రేటు చేరింది.
చదవండి: రెండు రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వచేయండి
దేశంలో ప్రస్తుతం 11,17,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదే విధంగా గడిచిన 24 గంటల్లో 84,825 మంది కోవిడ్ నుంచి కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488 చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో వెయ్యికిపైగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కేసులు రికార్డుస్థాయలో పెరగడంతో దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment