
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడడంతో ప్రజలకు కాస్త ఊరట లభిస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,197 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,246 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 3576 కి పెరిగింది. గత 24 గంటలల్లో 1707 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 5,93,577 మంది డిశ్చార్జ్ అయ్యారు.
చదవండి: వరంగల్ అర్బన్‌ను హన్మకొండ జిల్లాగా మారుస్తున్నాం: కేసీఆర్