![Coronavirus: 4207 New Positive Cases Registered In Telangana - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2022/01/20/corona.jpg.webp?itok=XNjelKXS)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తెలంగాణలో పాజిటివ్ కేసులు 4 వేల మార్క్‌ను దాటాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 4,207 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
గడిచిన 24 గంటల్లో 1,825 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం 26,633 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,22,403కు పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 6,91,703 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వైరస్ కారణంగా 4,067 మంది బాధితులు మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment