న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత మూడు రోజులుగా తగ్గుముఖం పడుతున్న కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. మరణాలు కూడా మరోసారి 1000 మార్కును దాటాయి. గడచిన 24 గంటల్లో 48,786 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,04,11,634కి చేరింది. నిన్న కోవిడ్‌తో 1005 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 3,99,459 చేరింది.
ఈ మేరకు గురువారం కేంద్ర వైద్యారోగ్యశాఖ కోవిడ్‌పై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం 5,23,257 లక్షల యాక్టీవ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే 61,588 మంది కోలుకోగా.. మొత్తం రికవరీలు 2.94 కోట్లు దాటింది. దేశంలో 96.92 శాతం కరోనా రికవరీ రేటు ఉంది. యాక్టివ్ కేసుల శాతం 1.77 శాతం, మరణాల రేటు 1.31 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment