
సినీనటుడు నందమూరి తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి యాజమాన్యం తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అయితే ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని వైద్యులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు బులెటిన్‌లో వైద్యులు వెల్లడించారు. కొన్ని మీడియాల్లో ఆయనకు ఎక్మోపై చికిత్స అందించినట్లు వచ్చిన కథనాలపై వైద్యులు క్లారిటీ ఇచ్చారు. ఆయనకు ఇప్పటి వరకు ఎక్మోపై ఎలాంటి చికిత్స అందించలేదని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం పరిస్థితిపై ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు వివరాలు అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment