సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థిరంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. గడచిన 24 గంటల్లో కొత్తగా 993 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,869 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 3644 కి పెరిగింది. గత 24 గంటలల్లో 1417 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 6,04,093 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment