
సాక్షి,అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో67,678 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,217 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 13 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,715 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,535 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19 లక్షల 72 వేల 399 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 15,141 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,60,34,217 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
చదవండి:Afghanistan: విషాదం, ఆకలితో కన్నవారి చేతుల్లోనే కన్నుమూసింది
Comments
Please login to add a commentAdd a comment