మెగా కోడలు, అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్ ఉపాసన కొణిదెల ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఆమె చేసే సేవా, సామాజీక కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవనక్కర్లేదు. అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ ద్వారా ఆమె నిత్యం హ్యుమన్ లైఫ్, వైల్డ్ లైఫ్ కోసం ఆమె నిత్యం కృషి చేస్తుంటారు. ఈ క్రమంలో ఆమెకు ప్రతిష్టత్మక అవార్డు నాట్ హెల్త్ సీఎస్‌ఆర్ అవార్డు వరించింది. గ్రామీణా ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషికి గుర్తింపు 2022 ఏడాదికి గానుఈ పురస్కారాన్ని ఉపాసన అందుకున్నారు.
చదవండి: తెలుగు సినిమాల్లో అసలు నటించను: బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్
ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ..ఓ గొప్ప కార్యక్రమంలో తమల్ని భాగం చేసిన తాతయ్య, అపోలో ఆస్పత్రుల ఫౌండర్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డికే ఈ అవార్డ్ ఘనత దక్కుతుందని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధిలో భాగంగా వైద్య సేవలను మెరుగుపర్చాలనే ఆయన లక్ష్యమే తనకు స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకుంటుండగా..సతీమణి ఉపాసన తన కెరీర్‌లో భర్త గర్వించే పురస్కారాలు అందుకోవడం విశేషం.
చదవండి: నేను కూడా ఈ వ్యాధితో బాధపడ్డాను, మానసికంగా కుంగిపోయా: హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment