తన తాత కల ఇదేనంటూ ఉపాసన వీడియో పోస్ట్‌! | Upasana Kamineni Shares A video in twitter goes viral | Sakshi
Sakshi News home page

తన తాత కల ఇదేనంటూ ఉపాసన వీడియో పోస్ట్‌!

Published Thu, Jul 26 2018 10:55 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

మెగా పవర్‌స్టార్‌ రాంచరణ్‌ను వివాహం చేసుకుని మెగా ఫ్యామిలీ కోడలిగా మారిన తర్వాత ఉపాసన బాధ్యతలు మరింత పెరిగాయి. సోషల్‌ మీడియాలో నిత్యం పలు అంశాలను, ఉపయోగకర విషయాలను ప్రస్తావించే ఉపాసన తాజాగా తన తాత (ప్రతాప్‌ రెడ్డి) కల ఇదేనంటూ ఓ వీడియోను తన ఫాలోయర్లతో షేర్‌ చేసుకున్నారు. సాధ్యమైనంత మందికి ఆరోగ్యకర జీవితాన్ని ఇవ్వాలని తాత కలలు కన్నారని ట్వీట్‌లో తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు చూడాలని తాత భావించారని.. ఇందులో భాగంగానే అపోలో హాస్పిటల్స్‌ స్థాపించి హెల్త్‌ కేర్‌ మోడల్‌కు శ్రీకారం చుట్టారని ట్విటర్‌ ద్వారా ఉపాసన వివరించారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement