
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత చికిత్స ఖర్చు వివరాలను మంగళవారం అపోలో ఆసుపత్రి వెల్లడించింది. ఆమె చికిత్సకు మొత్తం రూ.6.85 కోట్లు ఖర్చుచేసినట్లు అపోలో లండన్ డాక్టర్ రిచర్డ్ బీలే వెల్లడించారు. జయలలిత ఫిజియోథెరపీ కోసం సింగపూర్ ఆసుపత్రికి 1.29 కోట్ల, శశికళ కుటుంబ వసతి కోసం 1.24 కోట్ల, జయ ఆహారంకు 1.17 కోట్లు చెల్లించినట్లు డాక్టర్ రిచర్డ్ తెలిపారు. కాగా రెండేళ్ల క్రితం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనారోగ్యం కారణంగా జయలలిత మృతి చెందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment