చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత రక్త నమూనాలు వెంటనే సమర్పించాలని అపోలో ఆసుపత్రిని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. తాను జయలలిత కూతుర్ని అని అమృత అనే యువతి గతంలో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జయలలిత రక్త నమూనాలతో తన డీఎన్‌ఎను పోల్చి.. ఆమె వారసురాలిగా తనను గుర్తించాలని అమృత పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు బుధవారం అపోలో ఆసుపత్రికి ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. కాగా 2016 సెప్టెంబర్‌లో అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన జయలతిత అదే ఏడాది డిసెంబర్ 5న మృతిచెందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment