బంజారాహిల్స్: తన తల్లి చికిత్స నిమిత్తం ఆమెకు సహాయకురాలిగా జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి వచ్చిన సిరియా దేశానికి చెందిన బర్కా అనే యువతి ఆస్పత్రిలోని గదిలో ఉంటోంది. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం, తిమ్మరాజుపల్లి కాటేపల్లి గ్రామానికి చెందిన మునిచంద్ర ఆరు నెలల క్రితం ఇస్లాం మతం స్వీకరించాడు. మెహిదీపట్నంలో ఉంటూ ఎంబీఏ చేస్తున్నాడు. ఆమెను చూసి మనసు పారేసుకున్న మునిచంద్ర తాను ముస్లింనని తన పేరు మహ్మద్ ఆయాన్‌గా పరిచయం చేసుకోవడమే కాకుండా ముస్లిం మతాన్ని స్వీకరించినట్లు పత్రాన్ని కూడా ఇచ్చాడు.
ఈ నేపథ్యంలో ‘నువ్వు లేకుండా నేను ఉండలేను, నీది ఏ దేశమైనా ప్రేమిస్తూనే ఉంటాను నా ప్రేమను అంగీకరించు’ అంటూ ఓ లేఖ రాశాడు. తరచూ ఆమె గది వద్దకు వెళ్తూ వేధిస్తుండటంతో బాధితురాలు మంగళవారం రాత్రి సెక్యూరిటీకి ఫిర్యాదు చేసింది. సెక్యూరిటీ గార్డులు మునిచంద్రను చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment