సాక్షి, హైదరాబాద్: అపోలో జేఎండీ సంగీతారెడ్డికి కరోనా సోకింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా జూన్ 10న తాను కోవిడ్-19 బారిన పడ్డానని సంగీతారెడ్డి ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ తీసుకుని.. ఎన్ని జాగ్రత్తలు పాటించినా తనకు కరోనా సోకడం షాక్‌కు గురి చేసిందని పేర్కొన్నారు. వ్యాధినిర్ధారణ, చికిత్స రెండూ కీలకమైన అంశాలని తెలిపారు. కరోనా వల్ల విపరీతమైన జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేరానని ఆమె తెలిపారు.
అయితే కాక్టెయిల్, రీజెనెరాన్ థెరపీద్వారా కోలుకుంటున్నాను అన్నారు. వ్యాక్సిన్ కరోనాను అడ్డుకోలేదు...కానీ వైరస్ ప్రభావం తీవ్రం కాకుండా నిరోధిస్తుందని సంగీతారెడ్డి తెలిపారు. అందువల్ల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా జాగ్రత్తలు మరవొద్దు అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన డాక్టర్లు, నర్సులకు కృతజ్ఞతలు తెలిపారు.
After 500 days of dodging #COVID19 I tested +VE on June10th My initial reaction was of shock & dismay - Why me? I was careful & #vaccinated
— Dr. Sangita Reddy (@drsangitareddy) June 14, 2021
Hospitalized with high fever I took the cocktail #Regeneron therapy within the early window period & it has made a dramatic difference (1/2) pic.twitter.com/Qybrl61CUQ
చదవండి: రోజుకు పది లక్షల వ్యాక్సిన్లు పంపిణీకి సిద్ధం : అపోలో
Comments
Please login to add a commentAdd a comment