sangeeta reddy
-
వ్యాక్సిన్ తీసుకున్నాక పాజిటివ్: అపోలో జేఎండీ సంగీతారెడ్డి
సాక్షి, హైదరాబాద్: అపోలో జేఎండీ సంగీతారెడ్డికి కరోనా సోకింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా జూన్ 10న తాను కోవిడ్-19 బారిన పడ్డానని సంగీతారెడ్డి ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ తీసుకుని.. ఎన్ని జాగ్రత్తలు పాటించినా తనకు కరోనా సోకడం షాక్‌కు గురి చేసిందని పేర్కొన్నారు. వ్యాధినిర్ధారణ, చికిత్స రెండూ కీలకమైన అంశాలని తెలిపారు. కరోనా వల్ల విపరీతమైన జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేరానని ఆమె తెలిపారు. అయితే కాక్టెయిల్, రీజెనెరాన్ థెరపీద్వారా కోలుకుంటున్నాను అన్నారు. వ్యాక్సిన్ కరోనాను అడ్డుకోలేదు...కానీ వైరస్ ప్రభావం తీవ్రం కాకుండా నిరోధిస్తుందని సంగీతారెడ్డి తెలిపారు. అందువల్ల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా జాగ్రత్తలు మరవొద్దు అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన డాక్టర్లు, నర్సులకు కృతజ్ఞతలు తెలిపారు. After 500 days of dodging #COVID19 I tested +VE on June10th My initial reaction was of shock & dismay - Why me? I was careful & #vaccinated Hospitalized with high fever I took the cocktail #Regeneron therapy within the early window period & it has made a dramatic difference (1/2) pic.twitter.com/Qybrl61CUQ — Dr. Sangita Reddy (@drsangitareddy) June 14, 2021 చదవండి: రోజుకు పది లక్షల వ్యాక్సిన్లు పంపిణీకి సిద్ధం : అపోలో -
వినియోగ విశ్వాసం బలోపేతంతోనే వృద్ధి
ముంబై: ఆర్థికాభివృద్ధి అంశంలో వినియోగదారుని విశ్వాసం, మనోభావాలే కీలక పాత్ర పోషిస్తాయని ఫిక్కీ ప్రెసిడెంట్, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ అంశాల్లో బలహీనత నెలకొందని ఆమె అన్నారు. వినియోగ విశ్వాసం పటిష్టతే ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు. ఈ దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ జరిగిన ఒక గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ సందర్భంగా జరిగిన చర్చ గోష్టిలో ఆర్థిక అనిశ్చిత పరిస్థితిపై ఆమె మాట్లాడారు. ఆమె ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► కరోనా మహమ్మారి ప్రేరిత అంశాలతో దాదాపు 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. పూర్తి అనిశ్చితి, భయాందోళనకర పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక పురోగతికి ప్రభుత్వం నుంచి మరింత వ్యయాలు అవసరం. ► కరోనా ముందటి పరిస్థితితో పోల్చితే ఉత్పత్తి ప్రస్తుతం 60 నుంచి 70 శాతం స్థాయికి చేరిందని కర్మాగారాల నుంచి వార్తలు వస్తున్నాయి. రుణ లభ్యత బాగుంది. ఎగుమతులు దారిలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డిమాండ్ పెంపు పరిస్థితులపై ఆలోచించాలి. ఎందుకంటే వినియోగదారు విశ్వాసం ఇంకా బలహీనంగానే ఉంది. వారి మనోభావాలు మెరుగుపడకుండా వృద్ధిని మళ్లీ పట్టాలపైకి ఎక్కించడం అసాధ్యం. ఇందుకుగాను ప్రభుత్వం నుంచి ప్రత్యక్ష నగదు బదలాయింపులు మరింత జరగాలి. పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వృద్ధిలో ప్రత్యక్ష నగదు బదలాయింపు ఎంతో కీలకమవుతుంది. ► ఫిక్కీ ఇప్పటికే ప్రభుత్వానికి కన్జూమర్ వోచర్ విధానాన్ని సిఫారసు చేసింది. ప్రభుత్వం వ్యయాల కింద 30 నుంచి 50 శాతం డిస్కౌంట్‌తో కన్జూమర్ వోచర్ విధానాన్ని అమలు చేయడం వల్ల వ్యవస్థలో డిమాండ్ మెరుగుపడే అవకాశం ఉంటుంది. ► విధానాన్ని ఇకమీదట ఏ మాత్రం అనుసరించకూడదు. పూర్తి సాధారణ పరిస్థితులు నెలకొనాలి. ఏ విభాగంలోనూ ఇకపై లాక్డౌన్ నిబంధనలను ఏ మాత్రం అమలు చేయకూడదు. ► వేదాంతా గ్రూప్ సీఈఓ సునీల్ దుగ్గల్, టాటా మోటార్స్ సీఈఓ బషెక్, యాక్సెంచర్ సీఈఓ పీయూష్ సింగ్ తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు. వారి అభిప్రాయాలను చూస్తే... ద్రవ్యోల్బణంపై ఆందోళన అక్కర్లేదు వృద్ధిని తిరిగి పట్టాలు ఎక్కించే విషయానికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ద్రవ్యోల్బణంపై ఆందోళన చెందనక్కర్లేదు. ఎకానమీలోకి మరింత నగదు లభ్యత జరిగేలా చూడ్డం ఇప్పడు ముఖ్యం. ముఖ్యంగా మౌలిక రంగంలో వ్యయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనితోపాటు కార్మిక సంస్కరణల విషయంలో కూడా ప్రభుత్వం ముందడుగు వేయాలి. పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి. – సునీల్ దుగ్గల్, సీఈఓ, వేదాంతా గ్రూప్ డిమాండ్ పటిష్టతకు మరో 9 నెలలు ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ విభాగంలో డిమాండ్ ఊరటకలిగించే స్థాయిలో మెరుగుపడింది. అయితే అన్ని విభా గాల్లో డిమాండ్ పూర్తి పునరుత్తేజానికి ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుంది. – పీయూష్ సింగ్, సీనియన్ ఎండీ, యాక్సెంచర్ ఆటో... పన్ను రాయితీలు కావాలి కరోనా ప్రేరిత అంశాలతో ఆటో పరిశ్రమ దారుణంగా దెబ్బతింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రంగం 2010–11 స్థాయికి క్షీణిస్తుందన్నది అంచనా. పన్ను రాయితీలు ఈ రంగానికి తక్షణ అవసరం. – బషెక్, ఎండీ, సీఈఓ, టాటా మోటార్స్ -
అపోలో వైజాగ్ ఆసుపత్రి డిసెంబర్‌లోగా ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగ సంస్థ అపోలో హాస్పిటల్స్ వైజాగ్‌లో ఏర్పాటు చేస్తున్న ఆసుపత్రి ఈ ఏడాది డిసెంబర్‌లోగా ప్రారంభం కానుంది. 250 పడకలతో అత్యాధునిక వైద్య సదుపాయాలతో దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే వైజాగ్‌లో సంస్థకు ఆసుపత్రి ఉంది. నూతన ఆసుపత్రికి రూ.100 కోట్ల వ్యయం చేస్తున్నట్టు అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండీ సంగీత రెడ్డి చెప్పారు. గురువారం నాడిక్కడ మీడియా సమావేశానంతరం ఆమె సాక్షి బిజినెస్ బ్యూరోకు పై విషయం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో కూడా రూ.100 కోట్లతో 250 పడకల అత్యాధునిక ఆసుపత్రి నెలకొల్పుతామని పేర్కొన్నారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసేదీ ప్రకటించగానే పనులను ప్రారంభించేందుకు సిద్ధమని వెల్లడించారు. కరీంనగర్, కాకినాడ ఆసుపత్రుల్లో కేన్సర్ చికిత్స సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. జన్యు పరీక్షలతో.. అపోలో అనుబంధ కంపెనీ సెపియన్ బయోసెన్సైస్, బెంగళూరుకు చెందిన స్ట్రాండ్ లైఫ్ సెన్సైస్తో చేతులు కలిపింది. జన్యు ఆధారిత అత్యాధునిక పరీక్షల ద్వారా రోగులకు వ్యక్తిగత ఔషధాలను సూచించేందుకు వైద్యులకు ఈ భాగస్వామ్యం వీలు కల్పిస్తుందని స్ట్రాండ్ లైఫ్ సెన్సైస్ చైర్మన్ విజయ్ చంద్రు తెలిపారు. చికిత్సనుబట్టి పరీక్షలకు వ్యయం రూ.15 వేల నుంచి మొదలవుతుందన్నారు. కేన్సర్, హృదయ, వారసత్వ కంటి జబ్బులు, జన్యుపర రుగ్మతల చికిత్సలకు ఈ పరీక్షలు జరుపుతారు. జన్యులోపం ఎక్కడుందో గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని సంగీత రెడ్డి తెలిపారు. రోగి కుటుంబీకులు సైతం పరీక్షలు చేయించుకుంటే సమస్యలను ముందస్తుగా గుర్తించొచ్చని సూచించారు. పుట్టిన పిల్లలకు జన్యు పరీక్షలు చేసి ఆ వివరాలను భద్రపరిస్తే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలకు వేగవంతమైన పరిష్కారం లభిస్తుందన్నారు. జన్యు పరీక్షలను ప్రభుత్వ కార్యక్రమం కింద చేపట్టాల్సిందిగా కేంద్రాన్ని చాన్నాళ్లుగా కోరుతున్నామని తెలిపారు. -
10,000 బెడ్స్ కు చేరువలో అపోలో హాస్పిటల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ భారీగా విస్తరిస్తోంది. విజయవాడ, చిత్తూరులో అత్యాధునిక ఆస్పత్రులను అందుబాటులోకి తేనుంది. నెల్లూరులో నెలకొల్పుతున్న 200 పడకల ఆస్పత్రిలో కొద్ది రోజుల్లో సేవలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే సంస్థకు ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్, కరీంనగర్, విశాఖపట్నం, కాకినాడల్లో హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఈ సంస్థ 2014-15లో 800 పడకలను జోడిస్తోంది. దీంతో మొత్తం పడకల సామర్థ్యం 10,000 మార్కును దాటుతుందని అపోలో హాస్పిటల్స్ గ్రూపు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ఆపరేషన్స్) సంగీతా రెడ్డి తెలిపారు. అత్యాధునిక వైద్య సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేవాలన్నదే తమ లక్ష్యమని సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. విస్తరణ కార్యకలాపాల కోసం ఈ ఏడాది రూ. 800 కోట్లవరకూ వ్యయపరుస్తామని అన్నారు, అంత క్రితంతో పోలిస్తే డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైస్ కన్సాలిడేటెడ్ ఆదాయంలో 16 శాతం వృద్ధి నమోదు చేసింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే స్థాయిలో వృద్ధి ఆశిస్తున్నట్టు వెల్లడించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. ఒక్కో పడకకు రూ.1 కోటి.. మహారాష్ట్రలోని నాసిక్‌లో 125, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 120 పడకలతో కూడి న ఆసుపత్రులు త్వరలో ప్రారంభం అవుతున్నాయి. బెంగళూరులో 200 పడకలు, దక్షిణ చెన్నైలో 170 పడకలతో కొత్తగా ఆసుపత్రులు రానున్నాయి. అన్ని ఆసుపత్రులను నూతన టెక్నాలజీతో తీసుకొస్తున్నాం. వివిధ దేశాల్లో అందుబాటులో ఉన్న టెక్నాలజీని భారత్‌లోనూ పరిచయం చేయడంలో ముందుంటున్నాం. ఆసుపత్రి ఏర్పాటులో ఒక్కో పడకకు ఎంత కాదన్నా రూ.80 లక్షల నుంచి రూ.1 కోటి దాకా వ్యయం చేస్తున్నాం. ఇక చిత్తూరులో వైద్య కళాశాల రానుంది. తమిళనాడులోనూ కళాశాల ఏర్పాటు చేస్తాం. ఆ రాష్ట్రంలో ఇంకా ఎక్కడ నెలకొల్పేది నిర్ణయించలేదు. రెండేళ్లలో వీటిని అందుబాటులోకి తేవాలన్న ప్రణాళిక ఉంది. కొత్త ప్రభుత్వం ఫార్మా రంగంలో ఎఫ్‌డీఐలపై తీసుకునే చొరవ ఆధారంగా అపోలో ఫార్మా విభాగంలో వాటా విక్రయం ఉంటుంది. రూపాయి బలపడ్డంత మాత్రాన హెల్త్ టూరిజంపై తిరోగమన ప్రభావం ఉండదు. దీనికి కారణం థాయిలాండ్ వంటి దేశాలతో పోలిస్తే తక్కువ వ్యయానికే వైద్య సేవలు అందిస్తున్నాం కాబట్టి. భారత్‌లో తొలిసారిగా..: కేన్సర్ చికిత్సలో భారత్‌లో తొలిసారిగా ప్రోటాన్ థెరపీని పరిచయం చేయబోతున్నాం. అపోలో చెన్నై ఆసుపత్రిలో వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తోంది. ఇందుకోసం రూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సతో పోలిస్తే ప్రోటాన్ థెరపీ 10 రెట్లు మేలు. అమెరికాలో 27, చైనాలో 10 ప్రోటాన్ థెరపీ కేంద్రాలున్నాయి. ఇక టెలిమెడిసిన్ కేంద్రాలను భారీగా విస్తరిస్తున్నాం. ఇప్పటికే 135 కేంద్రాలున్నాయి. రెసిడెన్షియల్ భవనాల్లోనూ ఏర్పాటవుతున్నాయి. టాటా హౌసింగ్‌కు చెందిన 35 ప్రాజెక్టుల్లో టెలిమెడిసిన్ కేంద్రాలు రానున్నాయి. రోగులు ఆసుపత్రికి రాకుండానే ఈ కేంద్రాల నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపోలో కేంద్ర కార్యాలయంలోని వైద్యులను సంప్రదించవచ్చు. బీపీ, ఈసీజీతోపాటు రోగి గుండె వేగాన్ని తెలుసుకోవచ్చు.ఇందుకు ప్రత్యేక పరికరాలు టెలి మెడిసిన్ కేంద్రాల్లో ఉంటాయి. సాధారణ సమస్య అయితే వైద్యులు మందులను సిఫార్సు చేస్తారు. అత్యవసర చికిత్స అవసరమైతే ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు ఉంటాయి. టెలి మెడిసిన్‌లో సమయం ఆదా అవుతుంది. ఖర్చు తక్కువ. ప్రపంచంలో ఎక్కడైనా వీటిని ఏర్పాటు చేయొచ్చు. -
అపోలో మెగా హెల్త్ పార్కుకు లైన్ క్లియర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగ సంస్థ అపోలో హాస్పిటల్స్ చిత్తూరు జిల్లా మోర్కంబత్తూరులో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయతలపెట్టిన ప్రతిపాదిత మెగా హెల్త్ పార్కుకు మార్గం సుగమం అయింది. పార్కు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న స్థల వివాదం కాస్తా పరిష్కారం అయింది. 86 ఎకరాల్లో హెల్త్ పార్కును అందుబాటులోకి తేనున్నట్టు దాదాపు మూడేళ్ల క్రితం సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్థల వివాదం కారణంగా ప్రాజెక్టు ఆలస్యమైందని, వారం క్రితమే సమస్య పరిష్కారం అయిందని అపోలో హాస్పిటల్స్ గ్రూపు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ఆపరేషన్స్) సంగీతారెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు సోమవారం తెలిపారు. నిర్మాణ పనులను చకచకా ప్రారంభిస్తామని చెప్పారు. విశేషమేమంటే అపోలో గ్రూపు చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి చిత్తూరు జిల్లా వాసి కావడం. రెండేళ్లలో రెడీ.. ప్రతిపాదిత మెగా హెల్త్ పార్క్‌ను రెండేళ్లలో పూర్తి చేస్తామని సంగీతారెడ్డి పేర్కొన్నారు. సలహా సేవలు అందించే ప్రముఖ కంపెనీ కేపీఎంజీ సహాయం తీసుకుంటున్నట్టు చెప్పారు. ‘పార్కులో 200 పడకలతో అత్యాధునిక ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత వైద్య కళాశాలకు దరఖాస్తు చేస్తాం. వైద్య రంగానికి అవసరమైన శిక్షణ కేంద్రాలన్నీ ఇక్కడ అందుబాటులోకి తేనున్నాం. నర్సింగ్, సహాయకులు, నిర్వాహకులు, సాంకేతిక, పరీక్షా కేంద్రాల సిబ్బంది, వైద్యులు.. ఇలా అన్ని విభాగాలకు కావాల్సిన మానవ వనరులను తయారు చేస్తాం’ అని వివరించారు. సిబ్బంది నైపుణ్యం పెంచేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను కూడా ఈ కేంద్రాల్లో నిర్వహిస్తారు. 35 కంపెనీలతో.. సిరంజిలు, శస్త్ర చికిత్సకు వాడే పనిముట్లు, పడకలు, ట్రాలీ, స్ట్రెచెస్, ఇతర వైద్య ఉపకరణాల తయారీ కంపెనీలు పార్కులో అడుగు పెట్టనున్నాయి. 15 దాకా భారీ, మధ్య తరహా కంపెనీలు రానున్నాయి. వీటితోపాటు మరో 20 చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటవుతాయి. ఈ కంపెనీల్లో తయారైన ఉత్పత్తులను అపోలో ఆసుపత్రులకు వినియోగిస్తారు. అలాగే కొన్ని రకాల ఉత్పత్తులను అపోలో ఫార్మసీలకు సరఫరా చేస్తారు. అపోలో హాస్పిటల్స్ ఈ పార్కులో ఏర్పాటు చేసే ఆసుపత్రిలో ఒక్కో పడకకు రూ.40-60 లక్షలు వ్యయం అవుతుంది. సంస్థకు భారత్‌తోసహా వివిధ దేశాల్లో 61 ఆసుపత్రులు ఉన్నాయి. మొత్తం పడకల సంఖ్య 10 వేలపైనే.