ఫైల్‌ఫోటో
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్‌కు ఛాతీ నొప్పి రావడంతో అపోలో ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారన్న వార్త వినడానికే విచిత్రంగా ఉందని ఏఐసీసీ సభ్యుడు కొనగాల మహేశ్ అభిప్రాయపడ్డారు.తెలంగాణ నలుమూలల నుంచి పేద, మధ్యతరగతి వర్గాల ఆరోగ్య ఆశాజ్యోతి అయిన నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ ఆ ఆస్పత్రిని కాదని ప్రైవేటు ఆస్పత్రిలో చేరడం నిమ్స్‌లో పనిచేసే డాక్టర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందన్నారు.
అక్కడ పనిచేసే టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని కూడా అవమానపరచినట్లేనని బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. డైరెక్టర్ హోదాలో నిమ్స్ ఆస్పత్రిపై ప్రజలకు నమ్మకం పెంచాల్సింది పోయి ఆయనే కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లడాన్ని బట్టి నిమ్స్‌లో మౌలిక సౌకర్యాలు లేవని అర్థమవుతోందని విమర్శించారు.
చదవండి: ఈటలపై సస్పెన్షన్ వేటు?
Comments
Please login to add a commentAdd a comment