Orca Whales Are The Most Rapidly Becoming Extinct - Sakshi
Sakshi News home page

ఆడ పిల్లలంటే ఓర్కా తిమింగలాలకూ వివక్షే! మగ బిడ్డను సాకేందుకు ఏకంగా

Published Fri, Feb 24 2023 4:49 AM | Last Updated on Fri, Feb 24 2023 10:58 AM

Orca whales are the most rapidly becoming extinct - Sakshi

మగబిడ్డపై ఎక్కువ ప్రేమ చూపడం.. ఆడపిల్లపై వివక్ష చూపడమనేది మానవ సమాజంలో మాత్రమే కనిపించే అవలక్షణం అనుకుంటాం. కానీ.. మగ పిల్లవానిపై మమకారంతో జీవితంలో మరో బిడ్డకు జన్మనివ్వని జాతులు సైతం ఈ సృష్టిలో ఉన్నాయి. ఆ జాబితాలో ఓర్కా తిమింగలాలు ముందు వరసలో ఉన్నాయట. ఈ కారణంగా ఆ జాతి తిమింగలాల ఉనికికే ప్రమాదం ముంచుకొస్తోందనే విభ్రాంతికర వాస్తవం వెలుగులోకి  వచ్చింది. 

సాక్షి, అమరావతి: పుత్ర ప్రేమతో వంశాన్నే నాశనం చేసుకున్న ధృతరా్రషు్టడి గురించి మహాభారతంలో చదివే ఉంటారు. కానీ.. మగ బిడ్డలపై తల్లి ప్రేమ ఏకంగా ఓ జాతి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేసిం­ది. ఆ జాతే ఓర్కా తిమింగలాలు. వీటినే కిల్లర్‌ తి­మిం­గలాలు అని కూడా పిలుస్తారు.

పసిఫిక్‌ మ­హా­సముద్రం, అరేబియా సముద్రం, బంగాళా­ఖా­తం­ల­ో కనిపించే అరుదైన తిమింగలాలు ఇవి. అ­త్యం­­త తెలివైనవిగా గుర్తింపు పొందిన డాల్ఫిన్‌ జాతి­కి చెందిన ఓర్కా తిమింగలాల ప్రవర్తన అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. ఫలితంగా వాటి ఉనికే పె­ను ప్రమాదంలో పడింది. మానవులు వాటిని వేటాడుతుండటమో.. శత్రు జీవుల నుంచి తలెత్తుతు­న్న ముప్పు వంటివి దీనికి కారణం కాదు. కేవ­లం మగ బిడ్డల పట్ల తల్లి తిమింగలాలకు మితిమీ­రి­న మమకారమే కారణమన్నది ఆశ్చర్యకరమైన వాస్తవం.  



గుంపునకు నాయకత్వం వహిస్తాడనే ఆశతో.. 
సగటున 70 ఏళ్లు జీవించే ఓర్కా తిమింగలాలు గుంపు­లుగా సంచరిస్తాయి. పాడ్స్‌ అని పిలిచే ఆ గుంపున­కు ఓ బలమైన మగ తిమింగలం నేతృత్వం వహిస్తుంది. ప్రతి తల్లి తిమింగలం తాను కన్న మగబిడ్డే ఆ గుంపునకు నాయకత్వం వహించాలని కోరుకుంటా­యి. అందుకోసం తాము జన్మనిచ్చే మగ తిమింగ­లాల పట్ల విపరీతమైన మమకారాన్ని కనబరుస్తా­యి. ఎంతగా అంటే ఆడబిడ్డను పెద్దగా పట్టించుకో­వు. ఆడ తిమింగలం ఓ కాన్పులో ఒక బిడ్డకే జన్మనిస్తాయి.

ఆడబిడ్డ పుడితే  తల్లి తిమింగలం కేవలం 15 నెలల వరకే సాకుతుంది. ఆ తరువాత ఆడబిడ్డను వ­దిలేస్తుంది. మగబిడ్డ జన్మ నిస్తే మాత్రం తల్లి తిమింగలం  చేసే హడావుడి అంతాఇంతా కాదు. మగ బిడ్డ­ను ఎంతో సుకుమారంగా చూసుకుంటాయి. బిడ్డకు 20  ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసు వరకు సాకుతాయి. అంతవరకు మగబిడ్డకు తల్లి తిమింగలమే ఆహారా­న్ని తెచ్చి పెడుతుంది. తాను వేటాడి తెచి్చన ఆహారంలో సగానికిపైగా మగబిడ్డకే తినిపిస్తుంది. తాను కన్న  మగ తిమింగలమే ఆ గుంపునకు నాయకత్వం వహించాలని తల్లి తిమింగలం  ఎంత చేయాలో అంతా చేస్తుంది.

జీవవైవిధ్యంలో ప్రధానమైనవి 
ఓర్కా తిమింగలాలు అత్యంత అరుదైనవి.  జీవ వైవిధ్యంలో అత్యంత ప్రధానమైవవి కూడా. మగబిడ్డను అత్యంత మమకారంతో సాకడం కోసం తల్లి తిమింగలం మరో బిడ్డకు జన్మనివ్వకపోవడమన్నది వీటిలోనే మనం గమనిస్తాం. దాంతో వాటి సంఖ్య ప్రమాదకర స్థాయికి తగ్గిపోతోంది. వాటిని పరిరక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు.     
– ప్రొఫెసర్‌ భరతలక్ష్మి , జువాలజీ విభాగం,  ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం


మగ బిడ్డ పుడితే.. మరో బిడ్డకు జన్మనివ్వవు
మగ బిడ్డను బలంగా  తయారు చేసేందుకు తల్లి  తి­మిం­­గలాలు మరో పెద్ద నిర్ణయం  తీసుకుంటా­యి. ఓ సారి మగబిడ్డ పుడితే ఆ తల్లి తిమింగలం జీవితాంతం  పిల్లల్ని కనదు. ఎందుకంటే ఆడ  తిమింగ­లం గర్భధారణ సమయం 18 నెలలు. అంతకాలం తాను గర్భంతో ఉంటే అప్పటికే పుట్టిన మగబిడ్డను సక్రమంగా పెంచలేనని.. తగినంత ఆహారం అందిం­­చలేనని తల్లి తిమింగలం భావిస్తుంది. అందుకే మ­గబిడ్డ పుడితే తల్లి తిమింగలం మగ తిమింగలంతో  జ­త కట్టవు.  

ఈ నిర్ణయమే ఓర్కా తిమింగలాల జా­­తికి పె­­నుము­ప్పు­గాపరి­­ణ­­మిస్తోంది. ప్రధానంగా 1990 నుంచి క్రమంగా అంతరిస్తున్న వీటి ఉనికి 2005 తరువా­­త అత్యంత ప్రమాదంలో పడింది. ప్రస్తుతం ప్రపం­చంలో ఓర్కా తిమిం­గలాలు కేవలం 73 మా­త్ర­మే ఉన్నాయని లండన్‌లోని యూనివర్సి­టీ ఆఫ్‌ ఎక్సెసర్‌ తాజా అధ్యయనంలో  వెల్లడైంది. వాటిలో కేవ­లం మూడు మా­త్ర­మే గర్భంతో ఉండటం గమనార్హం.  అంటే ఓర్కా తిమింగలాల్లో పునరుత్పత్తి గణనీ­యంగా తగ్గిపోతోంది. 

ఇదే పరిస్థితి కొనసాగితే కొ­న్నేళ్ల­లో  ఓర్కా తిమింగలాలు కనుమరుగైపోతాయ­ని శా­స్త్ర­వేత్తలు ఆందోళన  వ్యక్తం చేస్తున్నారు. ఐక్యరాజ్య  స­మి­తి ఓర్కా తిమింగలాలను అత్యంత వేగంగా అంతరించిపోయే ప్రమాదం ఉన్న  జీవుల జాబితా­లో చే­ర్చి  వాటి పరిరక్షణకు పరిశోధనలను  ప్రోత్సహిస్తోంది.

ఓర్కా తిమింగలాల ప్రత్యేకతలు ఇవీ 
ఓర్కా తిమింగలాల పైభాగం ము­దు­­రు నలుపు రంగులోనూ.. కిందిభాగం స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉండటంతోపా­టు కళ్ల మీద దళసరిగా తెల్లని మచ్చ ఉంటుంది. 
ఇవి అత్యంత తెలివైన జీవులు. నోటితో ఈల వేస్తాయి. ఈలలు, సంజ్ఞలు, శబ్దాలు చేస్తూ పరస్పరం సంభాషిం చుకుంటాయి. 
 మానవుల మాటలు, హావభావాలను సరిగా అర్థం చేసుకుంటాయి. మానవులతో అత్యంత స్నేహంగా ఉంటాయి. 
 పసిఫిక్‌ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం కిల్లర్‌ తిమింగలాల ఆవాసాలు. 
 అమెరికాలోని అలస్కా, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, ఫ్లోరిడా రాష్ట్రాలు, ఒమన్‌ దేశంలో ఓర్కా తిమింగలాలను వీక్షించేందుకు ప్రత్యేక టూర్స్‌ నిర్వహిస్తున్నారు. 
మన దేశంలోని లక్షద్వీప్, అండమాన్‌  దీవులతోపాటు తమిళనాడు, పాండిచ్చేరి, మహారాష్ట్ర తీర ప్రాంతంలో అప్పుడప్పుడు  ఈ తిమింగలాలు కనిపిస్తుంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement