Whales
-
తిమింగలం సుదూర ప్రయాణం
వాతావరణ మార్పుల పెను ప్రభావాలు జలచరాలపై పడతాయని చెప్పే ప్రబల నిదర్శనమొకటి తాజాగా వెలుగుచూసింది. మహాసముద్రాల ఉపరితజలాల ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా చేపలు, తిమింగలం వంటి జలచరాల ఆహార లభ్యతలో మార్పులు సంభవిస్తున్నాయి. జత కట్టడానికి తోడు కోసం అలుపెరుగని అన్వేషణ కొనసాగిస్తున్నాయని తేలింది. చిన్న తిమింగలాల పెంపకానికి అనువైన వాతావరణం, పిల్లల్ని కనడానికి అనువైన సముద్రజలాల ఆవరణ కోసం ఈ భారీ జలచరం ఏకంగా 13,000 కిలోమీటర్లు ప్రయాణించిందని పరిశోధకుల పరిశోధనలో వెల్లడైంది. సరైన ఆవాసం, ఆహారం, తోడు కోసం దక్షిణ అమెరికా ఖండం నుంచి ఆఫ్రికా ఖండం దాకా వలస యాత్ర మొదలెట్టిన తిమింగలం.. ప్రయాణంలో భాగంగా ఏకంగా రెండు మహాసముద్రాలను దాటి మూడో మహాసముద్ర జలాల్లో తచ్చాడుతోంది. తిమింగలం తిప్పల కథ క్లుప్తంగా..9 సంవత్సరాల్లో..కొలంబియా దేశం సమీపంలో పసిఫిక్ మహా సముద్ర జలాల్లోని ‘గల్ఫ్ ఆఫ్ ట్రిబుగా’లో తొలిసారిగా 2013 జూలై పదో తేదీన ఒక బృందం ఈ మెగాప్టేరా నోవాఏంగ్లీ రకం హంప్‌బ్యాక్ మగ తిమింగలాన్ని చూశారు. దీని ఫొటోలను తీసి తిమింగలం వివరాలను పొందుపరిచే happywhale. com వెబ్సైట్లో పొందుపరిచారు. నాలుగేళ్ల తర్వాత దీనిని బహియే సోలానో ప్రాంతంలో కలియతిరగడం చూశారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత అంటే 2022 ఆగస్ట్ 22న ఏకంగా 13,046 కిలోమీటర్ల దూరంలోని ఆఫ్రికా ఖండంలోని హిందూ మహాసముద్ర ప్రాంతం ఝాంజిబార్ చానల్ వద్ద చూశారు. దీనికి సంబంధించిన వేలాది ఫొటోలను కృత్రిమ మేధతో సరిపోల్చి 2013లో దక్షిణ అమెరికాలో కనిపించిన తిమింగలం ఇదేనని తేల్చారు. మొదటిసారి చూసిన ప్రాంతానికి, 2022లో కనిపించిన ప్రాంతానికి మధ్య దూరం సరళరేఖా మార్గంలో చూస్తే 13వేల కి.మీ.లు ఉంటుందని, ఒక వేళ ఇది అర్ధచంద్రాకార మార్గంలో ఇక్కడికి చేరుకుని ఉంటే ఇది ఏకంగా 19,000 కిలోమీటర్లు ప్రయాణించి ఉంటుందని లెక్కతేల్చారు. ‘‘ ఒక తిమింగలం ఇంతదూరం వలసరావడం చరిత్రలో ఇదే తొలిసారి. సరైన ఆహారం, తోడు దొరక్క సుదూరాలకు ప్రయా ణిస్తోంది’’ అని టాంజానియా సెటాసియన్స్ ప్రోగ్రామ్ శాస్త్రవేత్త డాక్టర్ ఎకటేరినా కలష్నికోవా చెప్పారు. కలష్నికోవా పరిశోధనా వివరాలు రాయల్ సొసైటీ ఆఫ్ ఓపెన్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Covert Creatures: పావురాల నుంచి డాల్ఫిన్ల దాకా..
బెలుగా జాతికి చెందిన అరుదైన పెద్ద గూఢచారి తిమింగలం ‘హవాల్దిమీర్’దక్షిణ నార్వే తీరంలో బుల్లెట్ గాయాలతో విగతజీవిగా కనిపించడం ఇటీవల అంతర్జాతీయ వార్తాంశంగా నిలిచింది. దీంతో అసలు మనిషి ఇంతవరకు ఏ జాతుల జీవులను నిఘా కోసం గూఢచారులుగా వినియోగించుకున్నాడన్న చర్చ మొదలైంది. గూఢచారులుగా ఈ జంతువులు నిర్వర్తించిన విధుల్లేంటి. వాటిల్లో అత్యుత్తమ గూఢచారి ఏది? వంటి ఆసక్తికర అంశాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.. గూఢచార జీవులు... అత్యాధునిక పరికరాలు, చిన్న నిఘా కెమెరాలు రాకముందు సుదూర ప్రాంతాలకు రహస్య సమాచారాన్ని సురక్షితంగా చేరవేయడం ఓ సవాలుగా ఉండేది. దీంతో సందేశాలు పంపడానికి పావురాలను ఉపయోగించేవారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో నిఘా కోసం జర్మన్ సైన్యం ప్రత్యేకంగా బుల్లి కెమెరాలు రూపొందించి వాటిని పావురాలకు కట్టింది. వాటిల్లో రికార్డయ్యే సమాచారంతో శత్రు జాడ తెల్సుకునేది. రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాలూ గూఢచర్యానికి పావురాలనే నమ్ముకున్నాయి. 1970లలో అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) తన ప్రత్యేక నిగా ఆపరేషన్ ‘టకానా’లో భాగంగా బుల్లి కెమెరాలు అమర్చిన పావురాలను సోవియట్ రష్యాలోకి పంపింది. ఇలా పావురాలు మాత్రమే కాదు.. పిల్లులు, తిమింగలాలు, డాల్ఫిన్లు, ఇంకొన్ని రకాల పక్షులు, చనిపోయిన జంతువులు కూడా కోవర్ట్ ఆపరేటర్లుగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాయి. డాల్ఫిన్లతో ప్రత్యేకంగా.. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సోవియట్ నావికాదళం సముద్ర క్షీరదాలతో వివిధ కార్యక్రమాలను చేపట్టింది. వీటిలో ఒకటి డాల్ఫిన్లకు శిక్షణ ఇవ్వడం. అమెరికా నావికాదళం సముద్ర క్షీరదాల కార్యక్రమం(ఎంఎంపీ) కింద సముద్రజలాల్లో నిఘా కోసం డాల్ఫిన్లను ఉపయోగించింది. 1960లలో ప్రాజెక్ట్ ఆక్సిగాస్లో భాగంగా శత్రు నౌకలకు పేలుడు పరికరాలను అమర్చేందుకు సీఐఏ డాల్ఫిన్లకు శిక్షణ ఇచి్చంది. ఈ కార్యక్రమానికి సముద్రాల్లో స్వేచ్ఛగా తిరిగే రెండు ‘బాటిల్‌నోస్’డాల్ఫిన్లను ఉపయోగించారు. ప్రపంచంలోని అత్యంత తెలివైన జంతువులుగా డాల్ఫిన్లు ప్రసిద్ధి చెందాయి. క్రిమియాలోని సెవాస్టోపోల్ నల్లసముద్రంలోని నౌకాదళ స్థావరంలో శత్రు డైవర్లను గుర్తించడానికి, ఎదుర్కోవడానికి డాల్ఫిన్లకు శిక్షణ ఇచ్చేందుకు రష్యా గత సంవత్సరం ఒక క్షీరద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నివేదిక బహిర్గతంచేసింది. 2023 ఏప్రిల్ నుంచి జూన్ వరకు సెవాస్టోపోల్ నౌకాశ్రయంలో తేలియాడే క్షీరదాల బోనుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు బ్రిటిష్ సైనిక నిఘా ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. పిల్లుల చెవులకు మైక్రో ఫోన్లు పిల్లులను తెలివైన జంతువులుగా భావిస్తారు. సీఐఏ 1960వ దశకంలో పిల్లులను ఉపయోగించి ‘ఆపరేషన్ అకౌస్టిక్ కిట్టీ’అనే ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. దీని కోసం 2 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. ప్రాజెక్టులో భాగంగా పిల్లుల చెవుల్లో మైక్రోఫోన్లను ఏర్పాటు చేసింది. ఇవి సోవియట్ దౌత్యవేత్తలు, ఏజెంట్ల సంభాషణలను రహస్యంగా రికార్డ్ చేస్తాయి. పిల్లి పెంపుడు జంతువు. అది బహిరంగ ప్రదేశాలు, కొన్ని రహస్య ప్రదేశాల్లో అవి ప్రత్యక్షమవడం శత్రు దేశాలకు అనుమానాలు పెంచే అవకాశం ఉంటుంది. అదీగాక పిల్లులను నియంత్రించడం అంత సులభం కాదు. శిక్షణాసమయంలో వాటిని శిక్షకులు నియంత్రించలేక చేతులెత్తేశారు. పిల్లులు వాటికి సూచించిన ప్రాంతాలకు కాకుండా తమకిష్టమైన ప్రదేశాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో చేసేదిలేక చివరికి 1967లో ఈ కార్యక్రమానికి ఫుల్స్టాప్ పెట్టేశారు. టాప్ ఏజెంట్.. పావురం పిల్లులు, చనిపోయిన ఎలుకల వంటివాటిని రంగంలోకి దింపి పని కానిచి్చనప్పటికీ వివిధ దేశాల నిఘా సంస్థలు శతాబ్దాలుగా ఎక్కువ నమ్మకం పెట్టుకున్నది పావురం మీదనే. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నిర్వహించిన అత్యంత విజయవంతమైన గూఢచారి కార్యక్రమం ‘ఆపరేషన్ కొలంబా’పావురాలతోనే విజయంవంతమైంది. జర్మన్ సైనిక కార్యకలాపాలను, సున్నితమైన సైనిక స్థానాలపై నిఘాను హోమింగ్ జాతి పావురాలు సేకరించాయి. పేపర్‌పై రాసిన సందేశాలను సూక్ష్మ డబ్బాల్లో పెట్టి పక్షి కాలికి కట్టేశారు. ఈ రహస్య సందేశాలలో నాజీ దళాల కదలికలు, నాజీల కొత్త ఆయుధాలపై నివేదికలు, ప్రణాళికాబద్ధమైన రాకెట్ దాడుల వివరాలను వేగులు సేకరించి పావురాల ద్వారా ప్రధాన కేంద్రానికి రహస్యాన్ని పంపేవారు. రచయిత గోర్డాన్ కోరేరా ‘ఆపరేషన్ కొలంబా: ది సీక్రెట్ పీజియన్ సరీ్వస్’పుస్తకంలో ఇలాంటి ఎన్నో వివరాలు ఉన్నాయి. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ 1941 నుంచి 1944 మధ్య నాజీ ఆక్రమిత ఐరోపాపై 16,000 హోమింగ్ జాతి పావురాలను వాడారు. అన్నింటికన్నా ముఖ్యంగా పక్షుల ద్వారా గూఢచర్యం విజయవంతంకావడంతో నూతన టెక్నాలజీలకూ కపోతమే స్ఫూర్తిగా నిలిచింది. గత నెలలో చైనా అచ్చం పావురంలాగా ఉండే చిన్నపాటి నిఘా డ్రోన్‌ను ఆవిష్కరించడం తెల్సిందే. గూఢచార పావురాలని... భారత ఉపఖండంలో సందేశాలను పంపించడానికి పావురాలను ఉపయోగించినట్టుగా చరిత్ర చెబుతోంది. 2020 మేలో కశ్మీర్‌లోని ఓ గ్రామంలో నంబర్ల సెట్ ఉంగరం కలిగిన పావురం కనిపించింది. దానిని పట్టుకున్న గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. పాకిస్తాన్‌కు చెందిన గూఢచారి పావురమై ఉంటుందని, దానిపై ఉన్నది కోడ్ అని అనుమానించిన పోలీసులు.. డీ క్రిప్ట్ చేయడానికి ప్రయట్నించారు. చివరికది గూఢచారి పావురం కాదని తేలడంతో విడిచిపెట్టారు. 2016 అక్టోబర్‌లో భారత ప్రధానిని బెదిరిస్తూ మరో పావురం కనిపించింది. పంజాబ్‌లోని పఠాన్ కోట్లో ఈ పావురాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 2023 మేలో ముంబైలో దొరికిన పావురాన్ని చైనా గూఢచారిగా అనుమానిస్తూ ఎనిమిది నెలల పాటు బోనులో ఉంచి దాని ఆనుపానాలు సేకరించారు. ఆ పావురం కాలుకు ఉంగరాలు కట్టి, దాని రెక్కల కింది భాగంలో చైనీస్ భాషలో ఏదో రాశారు. అయితే అది తైవాన్‌లో రేసింగ్ పోటీలో పాల్గొన్న పక్షి అని ఫిబ్రవరిలో తేలడంతో ఎట్టకేలకు దానిని అధికారులు వదిలేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆడ పిల్లలంటే ఓర్కా తిమింగలాలకూ వివక్షే! మగ బిడ్డను సాకేందుకు ఏకంగా
మగబిడ్డపై ఎక్కువ ప్రేమ చూపడం.. ఆడపిల్లపై వివక్ష చూపడమనేది మానవ సమాజంలో మాత్రమే కనిపించే అవలక్షణం అనుకుంటాం. కానీ.. మగ పిల్లవానిపై మమకారంతో జీవితంలో మరో బిడ్డకు జన్మనివ్వని జాతులు సైతం ఈ సృష్టిలో ఉన్నాయి. ఆ జాబితాలో ఓర్కా తిమింగలాలు ముందు వరసలో ఉన్నాయట. ఈ కారణంగా ఆ జాతి తిమింగలాల ఉనికికే ప్రమాదం ముంచుకొస్తోందనే విభ్రాంతికర వాస్తవం వెలుగులోకి వచ్చింది. సాక్షి, అమరావతి: పుత్ర ప్రేమతో వంశాన్నే నాశనం చేసుకున్న ధృతరా్రషు్టడి గురించి మహాభారతంలో చదివే ఉంటారు. కానీ.. మగ బిడ్డలపై తల్లి ప్రేమ ఏకంగా ఓ జాతి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఆ జాతే ఓర్కా తిమింగలాలు. వీటినే కిల్లర్ తిమింగలాలు అని కూడా పిలుస్తారు. పసిఫిక్ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో కనిపించే అరుదైన తిమింగలాలు ఇవి. అత్యంత తెలివైనవిగా గుర్తింపు పొందిన డాల్ఫిన్ జాతికి చెందిన ఓర్కా తిమింగలాల ప్రవర్తన అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. ఫలితంగా వాటి ఉనికే పెను ప్రమాదంలో పడింది. మానవులు వాటిని వేటాడుతుండటమో.. శత్రు జీవుల నుంచి తలెత్తుతున్న ముప్పు వంటివి దీనికి కారణం కాదు. కేవలం మగ బిడ్డల పట్ల తల్లి తిమింగలాలకు మితిమీరిన మమకారమే కారణమన్నది ఆశ్చర్యకరమైన వాస్తవం. గుంపునకు నాయకత్వం వహిస్తాడనే ఆశతో.. సగటున 70 ఏళ్లు జీవించే ఓర్కా తిమింగలాలు గుంపులుగా సంచరిస్తాయి. పాడ్స్ అని పిలిచే ఆ గుంపునకు ఓ బలమైన మగ తిమింగలం నేతృత్వం వహిస్తుంది. ప్రతి తల్లి తిమింగలం తాను కన్న మగబిడ్డే ఆ గుంపునకు నాయకత్వం వహించాలని కోరుకుంటాయి. అందుకోసం తాము జన్మనిచ్చే మగ తిమింగలాల పట్ల విపరీతమైన మమకారాన్ని కనబరుస్తాయి. ఎంతగా అంటే ఆడబిడ్డను పెద్దగా పట్టించుకోవు. ఆడ తిమింగలం ఓ కాన్పులో ఒక బిడ్డకే జన్మనిస్తాయి. ఆడబిడ్డ పుడితే తల్లి తిమింగలం కేవలం 15 నెలల వరకే సాకుతుంది. ఆ తరువాత ఆడబిడ్డను వదిలేస్తుంది. మగబిడ్డ జన్మ నిస్తే మాత్రం తల్లి తిమింగలం చేసే హడావుడి అంతాఇంతా కాదు. మగ బిడ్డను ఎంతో సుకుమారంగా చూసుకుంటాయి. బిడ్డకు 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసు వరకు సాకుతాయి. అంతవరకు మగబిడ్డకు తల్లి తిమింగలమే ఆహారాన్ని తెచ్చి పెడుతుంది. తాను వేటాడి తెచి్చన ఆహారంలో సగానికిపైగా మగబిడ్డకే తినిపిస్తుంది. తాను కన్న మగ తిమింగలమే ఆ గుంపునకు నాయకత్వం వహించాలని తల్లి తిమింగలం ఎంత చేయాలో అంతా చేస్తుంది. జీవవైవిధ్యంలో ప్రధానమైనవి ఓర్కా తిమింగలాలు అత్యంత అరుదైనవి. జీవ వైవిధ్యంలో అత్యంత ప్రధానమైవవి కూడా. మగబిడ్డను అత్యంత మమకారంతో సాకడం కోసం తల్లి తిమింగలం మరో బిడ్డకు జన్మనివ్వకపోవడమన్నది వీటిలోనే మనం గమనిస్తాం. దాంతో వాటి సంఖ్య ప్రమాదకర స్థాయికి తగ్గిపోతోంది. వాటిని పరిరక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. – ప్రొఫెసర్ భరతలక్ష్మి , జువాలజీ విభాగం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం మగ బిడ్డ పుడితే.. మరో బిడ్డకు జన్మనివ్వవు మగ బిడ్డను బలంగా తయారు చేసేందుకు తల్లి తిమింగలాలు మరో పెద్ద నిర్ణయం తీసుకుంటాయి. ఓ సారి మగబిడ్డ పుడితే ఆ తల్లి తిమింగలం జీవితాంతం పిల్లల్ని కనదు. ఎందుకంటే ఆడ తిమింగలం గర్భధారణ సమయం 18 నెలలు. అంతకాలం తాను గర్భంతో ఉంటే అప్పటికే పుట్టిన మగబిడ్డను సక్రమంగా పెంచలేనని.. తగినంత ఆహారం అందించలేనని తల్లి తిమింగలం భావిస్తుంది. అందుకే మగబిడ్డ పుడితే తల్లి తిమింగలం మగ తిమింగలంతో జత కట్టవు. ఈ నిర్ణయమే ఓర్కా తిమింగలాల జాతికి పెనుముప్పుగాపరిణమిస్తోంది. ప్రధానంగా 1990 నుంచి క్రమంగా అంతరిస్తున్న వీటి ఉనికి 2005 తరువాత అత్యంత ప్రమాదంలో పడింది. ప్రస్తుతం ప్రపంచంలో ఓర్కా తిమింగలాలు కేవలం 73 మాత్రమే ఉన్నాయని లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెసర్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. వాటిలో కేవలం మూడు మాత్రమే గర్భంతో ఉండటం గమనార్హం. అంటే ఓర్కా తిమింగలాల్లో పునరుత్పత్తి గణనీయంగా తగ్గిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్నేళ్లలో ఓర్కా తిమింగలాలు కనుమరుగైపోతాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి ఓర్కా తిమింగలాలను అత్యంత వేగంగా అంతరించిపోయే ప్రమాదం ఉన్న జీవుల జాబితాలో చేర్చి వాటి పరిరక్షణకు పరిశోధనలను ప్రోత్సహిస్తోంది. ఓర్కా తిమింగలాల ప్రత్యేకతలు ఇవీ ► ఓర్కా తిమింగలాల పైభాగం ముదురు నలుపు రంగులోనూ.. కిందిభాగం స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉండటంతోపాటు కళ్ల మీద దళసరిగా తెల్లని మచ్చ ఉంటుంది. ►ఇవి అత్యంత తెలివైన జీవులు. నోటితో ఈల వేస్తాయి. ఈలలు, సంజ్ఞలు, శబ్దాలు చేస్తూ పరస్పరం సంభాషిం చుకుంటాయి. ► మానవుల మాటలు, హావభావాలను సరిగా అర్థం చేసుకుంటాయి. మానవులతో అత్యంత స్నేహంగా ఉంటాయి. ► పసిఫిక్ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం కిల్లర్ తిమింగలాల ఆవాసాలు. ► అమెరికాలోని అలస్కా, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, ఫ్లోరిడా రాష్ట్రాలు, ఒమన్ దేశంలో ఓర్కా తిమింగలాలను వీక్షించేందుకు ప్రత్యేక టూర్స్ నిర్వహిస్తున్నారు. ►మన దేశంలోని లక్షద్వీప్, అండమాన్ దీవులతోపాటు తమిళనాడు, పాండిచ్చేరి, మహారాష్ట్ర తీర ప్రాంతంలో అప్పుడప్పుడు ఈ తిమింగలాలు కనిపిస్తుంటాయి. -
కొట్టుకువచ్చిన... 500కి పైగా భారీ తిమింగలాలు
న్యూజిలాండ్‌లోని మారమూల చతం దీవుల్లోకి దాదాపు 500పైగా చనిపోయిన తిమింగలాలు కొట్టుకు వచ్చాయి. ఐతే ఆ ప్రాంతంలో ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టలేమని మెరైన్ బృదం తెలిపింది. మొదటగా ఆ బీచ్‌లో 250 తిమింగలాలు కొట్టుకువచ్చాయని ఆ తర్వాత మూడు రోజులకు 240కి పైగా కొట్టుకువచ్చాయిని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో రెస్క్యూ చర్యలు చేపట్టడం చాలా కష్టం అని అధికారులు న్యూజిలాండ్ ప్రభుత్వ సాంకేతిక సలహదారుడు లండ్ క్విస్ట్కి చెప్పారు. ఆ బీచ్‌లో ఒకటి రెండు తిమంగలాలు ఉంటే పర్లేదు కానీ ఏకంగా వందల సంఖ్యలో కొట్టుకు వచ్చాయని అందువల్ల అసాధ్యం అని చెప్పారు. పైగా తిమంగలాలు భారీగా ఉంటాయి. అవి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినప్పుడూ ఏ క్షణమైన పేలిపోవచ్చు అందవల్ల వాటిని అలానే వదిలేయాలని అధికారులు నిర్ణయించారు. అవి అలా సహజ సిద్ధంగా కుళ్లిపోవడమే మంచిదని అధికారులు నిర్ణయించారు. ఇలానే 1918లో సుమారు ఒక వెయ్యి తిమింగలాలు సాముహికంగా చనిపోయి కొట్టుకువచ్చినట్లు తెలిపారు. ఇలా ఆకస్మాత్తుగా వందల సంఖ్యలో తిమింగలాలు చనిపోయి ఎందుకు కొట్టుకు వస్తాయనేది తెలియడం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అదీగాక అధికారిక గణాంకాల ప్రకారం న్యూజిలాండ్‌లో ఏడాదికి సుమారు 300 సముద్ర జీవులు సాముహికంగా చనిపోయి కొట్టుకు వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. (చదవండి: కిమ్ రూటే సెపరేట్: క్షిపణి ప్రయోగం చేసిన స్థావరంలోనే..) -
పాపం.. ఒంటరైన తిమింగలం
-
తొలిసారి లక్షద్వీప్‌లో నీలి తిమింగలం పాట రికార్డు
న్యూఢిల్లీ: లక్షద్వీప్‌లో పిగ్మి నీలి తిమింగలాలున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. తాజాగా లక్షద్వీప్‌లో తొలిసారి పిగ్మి నీలి తిమింగలం పాట రికార్డ్ చేసినట్లు తెలిపారు. యూనివర్శిటీ ఆఫ్ ఓషనోగ్రఫీలో పీహెచ్డీ చేస్తున్న దివ్య పానికర్ ఈ విషయాన్ని తెలిపారు. ఈమె గత ఆరు సంవత్సరాలుగా తిమింగలాల మీద పరిశోధనలు చేస్తున్నారు. కేరళకు చెందిన దివ్య పానికర్ 2015లో తొలిసారి లక్షద్వీప్‌ను సదర్శించారు. ఆ సమయంలో ఆమె పలువురు జాలర్లును కలిసి మాట్లాడారు. వారిలో చాలామంది తాము లక్షద్వీప్‌లో పెద్ద పెద్ద తిమింగలాలను చూసినట్లు ఆమెకు చెప్పారు. దీనికంటే ముందే పలు శాస్త్రవేత్తల సమూహాలు హిందూ మహాసముద్రంలో అంతరించిపోతున్న పలు జాతులకు చెందిన జీవజాతులున్నట్లు వెల్లడించారు. అయితే ఇవన్ని ఇక్కడే స్థిరంగా ఉండేవా.. లేక వలస వచ్చినవా అనే దాని గురించి చెప్పలేకపోయారు. ఈ క్రమంలో గత ఆరేళ్లుగా ఇక్కడ పరిశోధనలు చేస్తున్న దివ్య పానికర్ వీటిలో కొన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘తొలిసారి ఈ నీటిలో పిగ్మి నీలి తిమింగాలాల పాట రికార్డు చేశాం. ఇక లక్షద్వీప్‌లో ఇవి ఉన్నాయనే దానికి నిదర్శనం ఈ పాట’’ అన్నారు. ‘‘గత కొన్నేళ్లుగా సాంకేతిక రంగంలో జరిగిన అభివృద్ధి ఈ పరిశోధనకు చాలా మేలు చేసింది. ధ్వని తరంగాలను గుర్తించడం ద్వారా స్వరం ఉన్న సముద్ర క్షీరదాలను గుర్తించగల్గుతాం. తిమింగలాల కదలికలను గమనించడం చాలా కష్టం. ఇవి ఎక్కువ దూరం ప్రయాణం చేయడమే కాక.. నీటి లోపల ఎక్కువ సమయం ఉంటాయి. అందుకే ధ్వని దార్వా వీటిని గుర్తిస్తాం. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్లో నేను ధ్వని ద్వారా సముద్ర క్షీరదాల జనాభా, పంపకాన్ని ఎలా లెక్కించవచ్చు అనే దాని గురించి నేర్చుకున్నాను’’ అని దివ్య పానికర్ తెలిపారు. ‘‘ఈ పరిశోధనల కోసం నేను డిసెంబర్, 2018లో సముద్రం లోపలికి వెళ్లి తిమింగలాలు చేసే ధ్వనిని రికార్డ్ చేయడం కోసం కవరత్తి ద్వీపం రెండు చివర్ల మైక్రోఫోన్స్ అమర్చి వచ్చాను. వీటిని విశ్లేషించగా.. ఏప్రిల్-మే నెలల మధ్య వీటి కార్యకలాపాలు గరిష్టంగా ఉన్నట్లు తెలిసింది. పిగ్మి నీలి తిమింగలం పాటలు నైరుతి రుతుపవన కాలమైన ఏప్రిల్-మేలో గరిష్టంగా ఉంటున్నాయి. దీన్ని బట్టి.. పిగ్మి నీలి తిమింగలాలు లక్షద్వీప్ ప్రాంతాన్ని కాలాల వారిగా వాడుకుంటున్నట్లు తెలిసింది’’ అన్నారు దివ్య పానికర్. 1960-70 కాలంలో సోవియట్ వేలింగ్ రికార్డు ప్రకారం లక్షద్వీప్ ప్రాంతలో నీలి తిమింగలాలున్నట్లు వెల్లడించింది. -
వైరల్: వేటగాళ్ల క్రూరత్వం.. తీరం మొత్తం రక్త సిక్తం..
మనిషిని సంప్రదాయం పేరిట ఉండే మూఢ నమ్మకం పిచ్చివాడిని చేస్తుంది. మనిషి కంటే ముందే జంతువులు భూమి మీద జీవించాయని సైన్స్ చెబుతోంది. అయితే భూమి ఆవిర్భవించిన తరువాత పుట్టిన చాలా జంతువులు ఇప్పుడు లేవు. ఈ ఆధునిక యుగంలోనూ మనకు తెలిసిన ఎన్నో జంతుజాతులు కనుమరుగైపోతున్నాయి. పూర్వం వన్యప్రాణులను రకరకాల కారణాల వల్ల వేటాడుతుండేవారు. కొందరు తమ బలప్రదర్శన, ధైర్య సాహసాలు నిరూపించుకోవడం కోసం జంతువులను వేటాడి చంపేవారు. ఫారో ఐస్లాండ్స్(తోర్షావ్న్): ఫారో దీవులలోని వేటగాళ్ళు 175 పైగా తిమింగలాలను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటన ఫ్రోస్లోని గ్రిన్‌డ్రాప్ లేదా గ్రైండ్ అని పిలిచే ద్వీపంలో ఆదివారం చోటు చేసుకుంది. దాదాపు 20 పడవల్లో వచ్చిన వేటగాళ్లు హుక్స్, కత్తులు, స్పియర్స్‌తో విచక్షణారహితంగా తిమింగలాలపై దాడి చేసి చంపారు. సముద్ర తీర ప్రాంతంలో ఓ చోట 52 పైలట్ తిమింగలాలను చంపగా.. మరో చోట 123 తిమింగలాలను హతమార్చారు. దీంతో సముద్ర తీరం మొత్తం రక్త సిక్తమైంది. ఈ విధంగా గత దశాబ్ద కాలంలో 6,500 పైగా తిమింగలాలు, డాల్ఫిన్లను బలితీసుకున్నారు. ఇదో అనాగరికమైన చర్యగా సీ షెపర్డ్ పేర్కొంది. ఇలా వెలుగులోకి.. సీ షెపర్డ్ పరిరక్షణకారులు ఓ డ్రోన్‌ను పంపించారు. అది తిమింగలాలు ఉండే ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఈ సంగతి బయట పడింది. అయితే ఆ సమయంలో ఓ ముష్కరుడు ఫోర్మ్యాన్ను వేటాడండి అంటూ.. డ్రోన్‌పై షాట్గన్తో కాల్పులు జరిపాడు. ఇక దీనిపై ఫారో దీవుల్లోని వారు కొన్ని గ్రూపులుగా విడిపోయాయి. కానీ చాలామంది వారి సంస్కృతిని గౌరవించాలని విదేశీ మీడియా, ఎన్జీఓలను కోరుతున్నారు. తిమింగలం మాంసం చాలా మంది స్థానికులు తింటారు. అయితే ఈ విధంగా భారీగా హతమార్చడాన్ని భరించలేమని వాటి పరిరక్షకులు వాదిస్తున్నారు. చదవండి: Covaxin: భారత్ బయోటెక్‌కు మరోసారి ఎదురుదెబ్బ జాకబ్ జుమాకు 15నెలల జైలు శిక్ష -
అటు కాదురా బాబూ.. ఇటూ..
పొలోమని వెళ్లిందేమో.. బెంగాల్ టైగర్‌ను చూడటానికి.. కనిపిస్తే.. వెంటనే కెమెరాతో క్లిక్మనిపించేయడానికి.. ఇక్కడ చూడండి.. పులి వచ్చి ఎదురుగా నిల్చుంటే.. వీళ్లంతా ఎటు చూస్తున్నారో.. రాజస్తాన్‌లోని రణతంబోర్ జాతీయ పార్కులో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ‘పార్కుకు వచ్చిన జనమంతా ఏదో పొదల వెనుక పులి ఉన్నట్లు అనిపిస్తే.. అటు చూస్తూ ఉండిపోయారు.. ఇటేమో.. ఈ పులి అకస్మాత్తుగా వాహనం ముందుకు వచ్చింది. చివరికి అది కూడా ఆశ్చర్యపోయినట్లుంది.. అందుకే నేనిక్కడ ఉంటే.. వీళ్లంతా ఎటు చూస్తున్నారబ్బా అంటూ.. వెనక్కి ఓసారి లుక్కిచ్చుకుని ముందుకు సాగింది’ అని ఈ చిత్రాన్ని తీసిన వన్యప్రాణి ఫొటోగ్రాఫర్ అర్పిత్ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ మధ్య మెక్సికోలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.. తిమింగలాలను చూడ్డానికి బయల్దేరిన కొందరు.. మనోళ్లలాగే.. ఎటో దిక్కులు చూస్తూ ఉండిపోయారు.. ఆ తర్వాత ఏం జరిగింది అంటే.. ఫొటో చూడండి.. మీకు అర్థమవుతుంది.. -
తిమింగలం వాంతి.. విలువ రూ.8 కోట్లు
యశవంతపుర: సముద్రాల్లో తిమింగళాలు చేసుకునే వాంతి (అంబర్గ్రిస్) బెంగళూరులో పెద్దమొత్తంలో పట్టుబడింది. అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల తయారీ ముడిపదార్థంగా అంబర్గ్రిస్కు పేరుంది. బెంగళూరు కేజీహళ్లి పోలీసులు సయ్యద్ తజ్ముల్పాషా (54), సలీంపాషా (48), నాసీర్ పాషా(34), రఫీవుల్లా షరీఫ్ (45) అనే నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 6 కేజీల అంబర్గ్రిస్ ముద్దలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.8 కోట్ల వరకూ ఉంటుందని తెలిపారు. నగరంలోని ఓ కొబ్బరితోటలో డ్రగ్స్ అమ్ముతున్నట్లు తెలిసి పోలీసులు దాడి చేయగా ఇది పట్టుబడింది. వీరికి అంబర్గ్రిస్ ఎక్కడ నుండి వచ్చిందనేది విచారణ చేపట్టారు. (చదవండి: Bombay HC: కరోనా మనందరి అతిపెద్ద శత్రువు.. సర్జికల్ దాడి చేయాల్సిందే!) -
చాథమ్ తీరంలో 100 తిమింగలాలు మృతి
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ తూర్పు తీరానికి 800 కిలోమీటర్ల (497 మైళ్ళు) దూరంలో ఉన్న చాథమ్ దీవులలో సుమారు 100 పైలట్ తిమింగలాలు, బాటిల్‌నోస్ డాల్ఫిన్లు చనిపోయినట్లు బుధవారం మెరైన్ అధికారులు తెలిపారు. ఈ ద్వీపం మారుమూల ప్రదేశంలో చిక్కుకున్న కారణంగా తక్షణ సహాయక చర్యలు చేపట్టలేకపోయామని అన్నారు. మొత్తం 97 పైలట్ తిమింగలాలు, 3 డాల్ఫిన్లు తీవ్ర అవస్థలు పడుతూ మరణించిన విషయం తమకు ఆదివారం తెలిసిందని న్యూజిలాండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జర్వేషన్ (డీఓసీ) తెలిపింది. (ఉటా ఎడారిలో మిస్టరీ దిమ్మె!) 'ఇంకా అక్కడ 26 తిమింగలాలు మాత్రమే సజీవంగా ఉన్నాయి. వాటిలో ఎక్కువ భాగం చాలా బలహీనంగా కనిపిస్తున్నాయి. సముద్రంలో చోటుచేసుకున్న పరిస్థితుల కారణంగా అవి అస్వస్థతకు గురయ్యాయి. సముద్రంలో గొప్ప తెల్ల సొరచేపలు కూడా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి' అని బయోడైవర్శిటీ రేంజర్ జెమ్మ వెల్చ్ అన్నారు. చాథమ్ దీవులలో జంతువులు గుంపులుగా ఉండటం సర్వసాధారణం. చాథమ్ ఐలాండ్ లో 1918లో అత్యధికంగా 1000కి పైగా తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకురావడమే చరిత్రలో భారీ ఘటన. కాగా చివరగా 1985లో 450కి పైగా వేల్స్ ఆక్లాండ్ లో ఇదే రీతిలో తీరానికి వచ్చాయి. అయితే ఇప్పుడు మరలా అదే పునరావృతం కావడంతో.. ఇలా ఎందుకు జరుగుతుంది? అనే ప్రశ్న సముద్ర జీవశాస్త్రజ్ఞులను కలవరపెడుతోంది. కాగా, సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియన్ తీరంలో సామూహికంగా నివశించే అనేక వందల తిమింగలాలు మరణించిన సంగతి తెలిసిందే. -
ఆంధ్రా తీరంలో తిమింగలాలు
సాక్షి, మచిలీపట్నం: తిమింగలాలు మన ప్రాంతంలోని సముద్ర తీరాన్ని ఆవాసాలుగా ఎంచుకున్నట్లు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) సుమారు నెల రోజుల క్రితం గుర్తించింది. రాష్ట్రంలోని విశాఖ సముద్ర తీరంలో రెండుచోట్ల, నెల్లూరు జిల్లా మోటుపల్లి, కాకినాడ తీర ప్రాంతాలను ఆవాసాలుగా ఎంచుకుని అక్కడ తిమింగలాలు నెలల తరబడి జీవనం సాగిస్తున్నట్లు (స్టాండింగ్ లొకేషన్స్)గా వెల్లడించింది. దశాబ్ద కాలం నుంచి రాష్ట్రంలోని తీరం వెంబడి తిమింగలాల కదలికలు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఆరేళ్లుగా మన తీరంలో వివిధ కారణాల వల్ల అవి మృత్యువాత పడి తీరానికి కొట్టుకొస్తున్నాయి. (చదవండి: లక్షల్లో ఫీజులు.. పురుగులతో భోజనం) సీఎంఎఫ్ఆర్ఐ మ్యాపింగ్‌తో గుర్తింపు దేశంలోని సముద్ర జలాల్లో జీవించే జంతు జాతుల కదలికలను గుర్తించేందుకు సీఎంఎఫ్ఆర్ఐ ఇటీవల మ్యాపింగ్ రూపొందించింది. దీని ద్వారా తూర్పు తీరాన గల బంగాళాఖాతంలో అరుదైన జంతు జాతుల కదలికలు ఉన్నట్లుగా గుర్తించింది. వీటిలో ప్రధానమైనవి బెలీన్ తిమింగలాలు. వీటికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. నలుపు, బూడిద రంగుల్లో ఉండే ఇవి ఉత్తర అట్లాంటిక్ సముద్ర ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తుంటాయి. 20 అడుగుల పొడవు, 3 వేల కిలోల బరువుండే ఈ తిమింగలాలు 70నుంచి 80 ఏళ్ల పాటు జీవిస్తాయి. ఇవి సాధారణ తిమింగలాలతో కలవవు. వేసవిలో ధృవ ప్రాంతాల్లో చల్లని, పోషకాలు అధికంగా ఉండే నీటి వనరుల్లోకి తరలి వెళ్తాయి. శీతాకాలంలో మాత్రం ఉష్ణ మండల జలాల్లోకి వలసపోతాయి. కనీసం రెండు మూడు నెలల పాటు ఒకే ప్రాంత జలాల్లో సంచరిస్తుంటాయి. రోజుల తరబడి కదలకుండా ఒకేచోట ఉండగలుగుతాయి. కృష్ణా జిల్లా నాగాయలంకలో మృతి చెందిన తిమింగలాల కళేబరం (ఫైల్ ఫొటో) మ్యాపింగ్ ఎలా చేస్తారంటే.. దేశం వ్యాప్తంగా విస్తరించి ఉన్న సముద్ర జలాల్లో ఎక్కడెక్కడ ఏయే రకాల జలచరాలు ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయనే విషయాన్ని శాటిలైట్ ఆధారిత జీపీఎస్ కో–ఆర్డినేట్స్ ద్వారా అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా గుర్తిస్తారు. వివిధ రకాల జలచరాలు ఏయే ప్రాంతాల్లో ఎక్కువ రోజులు ఉంటున్నాయి, ఏ ప్రాంత జలాల్లో చనిపోయి ఏ తీరంలోకి కొట్టుకొస్తున్నాయో పరిశీలిస్తారు. ఫిష్ ల్యాండింగ్ పాయింట్స్, వేట సమయంలో మత్స్యకారుల పరిశీలనలోకి వచ్చిన విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇలా అన్ని కోణాల్లో పరిశీలించి, అధ్యయనం చేస్తారు. ఇలా గుర్తించిన ప్రాంతాలను మ్యాపింగ్ చేసి వాటి స్టాండింగ్ లొకేషన్స్‌ను ప్రకటిస్తారు. తిమింగలం జాతుల స్ట్రాండింగ్ లొకేషన్స్ ప్రకటించడం వల్ల వాటి పరిరక్షణపై దృష్టి పెట్టొచ్చు. వాటి ఉనికికి ఇబ్బంది లేకుండా అవి సంచరించే ప్రదేశాల్లో భారీ నౌకలను దారి మళ్లించడం, వేటను నిషేధించడం, నీటి అడుగు భాగాల్లో నావికా, తీర భద్రతా విభాగాలు సాగించే ప్రయోగాలు నియంత్రించడం వంటి చర్యలు చేపట్టడం ద్వారా వాటి జీవనానికి ఇబ్బంది లేకుండా చూసే వీలు కలుగుతుంది. ఏపీ తీరంలో 2013 నుంచి తిమింగల జాతుల మరణాలు నమోదవుతున్నాయి. తీరానికి కొట్టుకొచ్చిన వాటి మృత కళేబరాలను అటవీ శాఖ అధికారులు సేకరించి పరిశోధనలకు తరలిస్తున్నారే తప్ప.. మరణాలకు గల కారణాలను మాత్రం శోధించలేకపోతున్నారు. మ్యాపింగ్ అందుబాటులోకి రావడం వల్ల కారణాలను అధ్యయనం చేసే వీలు కలుగుతుంది. పరి రక్షణకు ప్రత్యేక చర్యలు మ్యాపింగ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో తిమింగలాల ఆవాసాలకు సంబంధించి నాలుగు స్టాండింగ్ లొకేషన్స్ గుర్తించాం. నావల్, తీర భద్రతా దళాలు తిమింగలాల స్టాండింగ్ లొకేషన్స్‌లోని జలాల్లో కసరత్తులు చేయకుండా సూచనలు ఇవ్వవచ్చు. ఇటీవల కేరళ తీరంలోని సముద్ర జలాల్లో చిక్కుకున్న తిమింగలాలకు పునరావాసం కల్పించేందుకు సీఎంఎఫ్ఆర్ఐ (కొచ్చి) ప్రత్యేక చర్యలు చేపట్టింది. అదే రీతిలో ఏపీలో కూడా అటవీ శాఖ సహకారంతో తిమింగలాల పరిరక్షణకు చర్యలు చేపట్టొచ్చు. – ఎడ్వర్డ్, శాస్త్రవేత్త, సీఎంఎఫ్ఆర్ఐ, విశాఖపట్నం ఆవాసాలపై ప్రత్యేక దృష్టి పెట్టొచ్చు మన ప్రాంతంలోని సముద్ర జలాల్లో తిమింగలాలు రోజులు, నెలల తరబడి నివాసం ఉంటున్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్లే నౌకలు ఢీ కొట్టడం, నౌకల నుంచి విడుదలయ్యే ఆయిల్స్ వల్ల భూగర్భంలో ఆక్సిజన్ తగ్గిపోవడం వంటి కారణాల వల్ల తిమింగలాలు చనిపోతుంటాయి. అవి సంచరించే స్టాండింగ్ లోకేషన్స్‌ను గుర్తించడం వల్ల ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి రక్షణ చర్యలు చేపట్టే అవకాశం కలుగుతుంది. – డాక్టర్ ఎల్.సుశీల, అసిస్టెంట్ ప్రొఫెసర్, కృష్ణా యూనివర్సిటీ -
333 తిమింగలాలు ఊచకోత..
టోక్యో: బూడిద రంగు తిమింగలాలపై పరిశోధనల పేరుతో జపాన్ చేపట్టిన దుర్మార్గమైన సముద్ర వేటలో 333 తిమింగలాలు హతమయ్యాయి. జపాన్ ఊచకోత కోసిన 128 ఆడ తిమింగలాల్లో 122 గర్భంతో ఉన్నట్లు ఒక రిపోర్టు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. దక్షిణ అంటార్కిటికా మహా సముద్రంలో పరిశోధనల పేరిట జపాన్ ఈ ఘాతుకానికి పాల్పడింది. కాగా, 2014 మార్చిలో అంతర్జాతీయ న్యాయస్థానం జపాన్ చర్యలపై స్పందించింది. పరిశోధనల పేరుతో బూడిద రంగు తిమింగలాల విచ్చలవిడి వేటను నిలిపేయాలని ఆదేశించింది. తిమింగలాల వేటను వ్యాపార అవకాశంగా జపాన్ మారుస్తోందని కోర్టు ఆక్షేపించింది. ప్రతి ఏటా డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు 12 వారాల పాటు నిర్విరామంగా జపాన్ సముద్ర యాత్ర చేస్తుంది. అయితే, ఐసీజే ఉత్తర్వులు, అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా జపాన్ తన వైఖరి మార్చుకుంది. ఏటా దాదాపు 900 పైగా తిమింగలాలను వేటాడే బదులు ఈ ఏడాది 333 తిమింగలాలకే పరిమితమైంది. బూడిద రంగు తిమింగలాల సంఖ్య, వాటి ప్రవర్తన, జీవ శాస్త్రీయ అధ్యయనం కోసం వేటాడుతున్నామనీ, తిమింగలాల వేట తమ సంస్కృతిలో భాగమని జపాన్ వాదిస్తోంది. కాగా, ఈ ఘటనపై తిమింగలాల పరిరక్షణ సమితి మాత్రం పెద్ద ఎత్తున్న ఉద్యమించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు మూగజీవాల పట్ల జపాన్ ప్రభుత్వం కొనసాగించిన దమనకాండపై జంతు పరిరక్షణ సమితులు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తుండగా.. ఈ వేట ప్రతి యేటా జరిగే తంతేనని కొందరు కొట్టిపారేస్తున్నారు. -
దుర్మార్గపు చర్యకు పాల్పడ్డ జపాన్
టోక్యో : దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డ జపాన్.. పలు దేశాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది. ఏకంగా 300 నీలి తిమింగలాను వేటాడి, అతిక్రూరంగా చంపింది. అంటార్కిటిక్ మహాసముద్రంలో ఈ ఆపరేషన్‌ను నిర్వహించగా.. ఎలాంటి అవాంతరాలు, అభ్యంతరాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేసినట్లు శనివారం జపాన్ ప్రకటించుకుంది. తిమింగలాలపై పరిశోధనల పేరిట గత నవంబర్‌లో మొత్తం ఐదు నావలు దక్షిణమహా సముద్రం నుంచి బయలుదేరాయి. అయితే అది వెళ్లింది పరిశోధనకు కాదని.. వారికి హతమార్చేందుకని ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ సమయంలో పలు దేశాలు జపాన్ చేష్టలను తీవ్రంగా ఖండించాయి. మొత్తం 333 తిమింగలాలను హతమార్చి వాటి మృతదేహాలను నావల్లో వేసుకుని వచ్చాయి. శనివారం ఉదయం పశ్చిమ జపాన్‌లోని షిమోనోసెకి పోర్ట్‌కు చేరుకున్నాయి. అయితే తిమింగలాల ప్రవర్తన, జీవశాస్త్రీయ అధ్యయనం కోసమే ఈ ఆపరేషన్ చేపట్టామని జపాన్ ప్రభుత్వం తమ చేష్టలను సమర్థించుకుంటుండగా.. తిమింగలాల పరిరక్షణ సమితి మాత్రం పెద్ద ఎత్తున్న ఉద్యమించేందుకు సిద్ధమైపోయింది. మరోవైపు మూగజీవాల పట్ల జపాన్ ప్రభుత్వం కొనసాగించిన దమనకాండపై జంతు పరిరక్షణ సమితులు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తుండగా.. ఈ వేట ప్రతీయేటా జరిగే తంతేనని కొట్టిపారేసేవాళ్లు లేకపోలేదు. -
తీవ్ర విషాదం: తీరానికి కొట్టుకొచ్చాయి..
పెర్త్ , ఆస్ట్రేలియా : వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని హమెలిన్ సముద్ర తీరంలో పెను విషాదం చోటు చేసుకుంది. దాదాపు 150 వేల్స్ ఒడ్డుకు కొట్టుకువచ్చి ప్రాణాలు విడిచాయి. మృత్యువాత పడ్డ వేల్స్‌ను తినేందుకు షార్క్‌లు ఎగబడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన హృదయవిదారక దృశ్యాలను చిత్రీకరించిన స్థానికులు సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. నది సముద్రం కలిసే చోట నీటికి ఎదురొచ్చిన వేల్స్ గుంపు ఇలా సముద్ర తీరానికి వచ్చి తిరిగి వెళ్లలేక ప్రాణాలు కోల్పోయాయని భావిస్తున్నారు. ఈ ఘటనపై డెయిలీ మెయిల్‌తో మాట్లాడిన స్థానిక మహిళ.. ఒడ్డుకు కొట్టుకొచ్చిన వందలాది వేల్స్లో తాను చూస్తుండగా మరణించాయని చెప్పారు. మరికొన్ని నీటిలోకి తిరిగి వెళ్లడానికి చేసిన ప్రయత్నాన్ని చూసి కంటతడి ఆగలేదని వెల్లడించారు. వాటికి సాయం చేయలేని తన నిస్సహాయతను ఆమె నిందించుకున్నారు. మరణించిన వేల్స్ మాంసం కోసం షార్క్‌లు తీరానికి వచ్చాయని చెప్పారు. తాము ఇచ్చిన సమాచారంతో బీచ్ వద్దకు చేరుకున్న రక్షకులు క్రేన్స్ సాయంతో కేవలం ఆరు వేల్స్‌ను మాత్రమే రక్షించగలిగారని వివరించారు. మిగిలిన వాటిని రక్షించేలోపే అవి ప్రాణాలు వదిలాయని తెలిపారు. ఒక్కో వేల్ నాలుగు టన్నులకు పైగా బరువుందని, అంత భారీ బరువున్న వాటిని సముద్రం లోపలికి(ఒక కిలోమీటర్ పాటు) తరలించడం రక్షకులకు కష్టసాధ్యమైందని అన్నారు. -
తిమింగలాలను తినేస్తున్నారు..!
టోక్యో : ఓ వైపు జీవవైవిధ్యం, సమతుల్యతను కాపాడాలంటూ ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు నెత్తీ నోరు బాదుకుంటుంటే జపాన్ మాత్రం ఆ మాటలను చెవికెక్కించుకోవడం లేదు. ఈ ఏడాది తాము ఏకంగా 177 తిమింగలాలను వేటాడినట్లు మంగళవారం ప్రకటించింది. ఈ ప్రకటనపై పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. తిమింగళాల పరిరక్షణకు ఉద్దేశించిన ‘అంతర్జాతీయ వేలింగ్ కమిషన్’ మారటోరియంపై సంతకం చేసి ఇలాంటి చర్యలకు దిగడంపై జపాన్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాస్త్రీయ పరిశోధనల పేరిట అవసరమున్నదాని కంటే ఎక్కువ తిమింగళాలను జపాన్ వేటాడుతోంది. జపాన్‌లో తిమింగలాల మాంసం తినేవారి సంఖ్య ఏటా తగ్గుతోన్నా.. భారీస్థాయిలో ఎందుకు వేటాడుతుందో అంతుబట్టడం లేదు. 2014లో అంతర్జాతీయ న్యాయస్థానం ఆగ్రహించడంతో 2014–15లో అంటార్కిటికా జలాల్లో వేటను నిషేధించిన జపాన్ ఏడాది తరువాత నుంచి తిరిగి కొనసాగిస్తోంది. మరోవైపు జపాన్‌తో పాటు నార్వే, ఐస్లాండ్ దేశాలు కూడా ఒప్పందానికి కట్టుబడకుండా తిమింగలాలను యధేచ్ఛగా వేటాడుతూ, జంతుహక్కులకు తూట్లు పొడుస్తున్నాయి. -
416 వేల్స్ ఒడ్డుకు ఎందుకు వచ్చాయి?
ఇంటర్నెట్ ప్రత్యేకం: సముద్ర అంతర్భాగంలో భారీ ఆకారంతో కనిపించే జీవులు వేల్స్. వేల్స్‌ను అందరూ రియల్‌గా చూడకపోయినా హాలీవుడ్ సినిమాల్లో కచ్చితంగా చూసే ఉంటారు. న్యూజిలాండ్‌లో ఓ బీచ్ ఒడ్డుకు వందలాది వేల్స్ గురువారం రాత్రి కొట్టుకువచ్చాయి. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన అక్కడి అధికారులు, కొంతమంది వాలంటీర్లు వాటన్నింటిని తిరిగి సముద్రంలోకి పంపేందుకు ప్రయత్నం చేశారు. కానీ అందులో వారు విఫలమయ్యారు. ఒడ్డుకు వచ్చిన వేల్స్‌ను సముద్రంలోకి కొంతమేర తీసుకువెళ్లి వదిలినా అవి తిరిగి వెనక్కు వచ్చేశాయి. ఒడ్డుకు వచ్చిన 416 వేల్స్లో శుక్రవారం ఉదయానికి 300పైగా ప్రాణాలు విడిచాయి. దీంతో ఒక్కసారిగా గోల్డెన్ బే బీచ్‌లో విషాదం అలముకుంది. మిగిలిన వేల్స్‌ను రక్షించేందుకు అధికారులు, వాలంటీర్లు తమ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. వేల్స్ సహజంగా గుంపుగా జీవిస్తాయి. వీటికి ఒక నాయకుడు ఉంటాడు. ఒకసారి ఒడ్డుకు వచ్చిన వేల్స్ తిరిగి నాయకుడు దారి చూపే వరకూ అక్కడే ఉండిపోతాయి. వేల్స్ వాటంతటవే ఎందుకు ఒడ్డుకు వచ్చేస్తున్నాయో తెలియడం లేదని ఓ అధికారి చెప్పారు. దాదాపు 100 వేల్స్లను అతికష్టం మీద తిరిగి సముద్రంలోనికి పంపినట్లు వెల్లడించారు. ఇంత పెద్ద సంఖ్యలో వేల్స్ ఒడ్డుకు కొట్టుకురావడం ఈ దశాబ్దంలో ఇదే తొలిసారని చెప్పారు. కాగా, 1918లో వెయ్యి, 1985లో 450 వేల్స్ న్యూజిలాండ్‌లోని బీచ్‌ల ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. వేల్ సంరక్షణ బృందం తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి ఏటా 300 డాల్ఫిన్లు, వేల్స్ తీరానికి వచ్చి ప్రాణాలు విడుస్తున్నాయని చెప్పారు. -
తీరంలో వందల తిమింగళాల మృతదేహాలు!
-
తీరంలో వందల తిమింగలాల మృతదేహాలు!
వెల్లింగ్టన్: వందల కొద్ది తిమింగలాలు తీరానికి కొట్టుకువచ్చి నిర్జీవంగా పడి ఉండటం జంతు ప్రేమికులతో పాటు సామన్య ప్రజానికాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. న్యూజిలాండ్ దక్షిణ ద్వీపాల్లోని గోల్డెన్ బే తీరంలో ఈ విషాదకర ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక అధికారి ఆండ్రూ లామసన్ కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం 416 తిమింగలాలు తీరానికి కొట్టుకువచ్చాయని, అందులో వందకు పైగా తిమింగలాలు చనిపోయి కళేబరాలుగా పడి ఉన్నాయని చెప్పారు. వందల తిమింగలాలు చనిపోయి నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు ప్రాణాలతో ఉన్న కొన్ని తిమింగలాలను మళ్లీ నీటిలోకి వెళ్లేలా చేశారు. తమ వల్ల పూర్తి చర్యలు సాధ్యంకాదని భావించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఎన్ని తిమింగలాలు చనిపోయాయే లెక్క తేల్చడం కష్టంగా ఉందని, పైగా వీటి మధ్య ఉండి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వాటిని సముద్రంలోకి చేర్చడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని అధికారి ఆండ్రూ లామసన్ తో పాటు న్యూజిలాండ్ రేడియో వెల్లడించారు. చాథమ్ ఐలాండ్ లో 1918లో అత్యధికంగా 1000కి పైగా తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకురావడమే చరిత్రలో భారీ ఘటన. కాగా చివరగా 1985లో 450కి పైగా వేల్స్ ఆక్లాండ్ లో ఇదే రీతిలో తీరానికి వచ్చాయి. న్యూజిలాండ్ చరిత్రలో ఇది మూడో భారీ విషాదకర ఘటన అని అధికారులు చెబుతున్నారు. ఇవి పైలట్ వేల్స్ రకమని, ఈ తిమింగలాలు దాదాపు 20 అడుగుల పైగా పొడవు వరకు పెరుగుతాయని చెబుతున్నారు. వేల్స్ ఇలా తీరానికి కొట్టుకురావడం, చనిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని.. ఇంకా చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. -
బీచ్ లో భారీ తిమింగలాలు
కాకినాడ: వాకలపూడి హరితా రిసార్ట్స్ వెనుక భాగంలోని సముద్రతీరానికి గురువారం ఉదయం భారీ తిమింగలం (బుక్కుసొర్ర) కొట్టు కొచ్చింది. 13 అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పు ఉన్న తిమింగలం టన్నుకు పైగా బరువు ఉంది. సముద్రంలో చేపలు తింటూ.. ఒడ్డునున్న ఇసుకలోకి రావడంతో తిరిగి లోపలికి వెళ్లలేక చనిపోయిందని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. ఈ భారీ తిమింగలాన్ని చూసేందుకు పర్యాటకులు, మత్స్యకారులు తరలివెళ్తున్నారు. ఉప్పాడ సముద్ర తీరంలోనూ భారీ తిమింగలం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. విషయం తెలుసుకున్న కోరంగి అభయారణ్యం అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఉప్పాడ సముద్రతీరానికి వెళ్లి క్రేన్ల సాయంతో చొల్లంగి అభయారణ్యానికి తరలించారు. రెండున్న టన్నుల బరువున్న తిమింగలం పొట్టను చీల్చి పేగులు, వ్యర్థాలను బయటకు తీసి ఒక టన్ను బరువుకు తగ్గించారు. సందర్శకుల కోసం ఉంచారు. -
అమ్మో.. ఎన్ని తిమింగలాలో!
-
అమ్మో.. ఎన్ని తిమింగలాలో!
చెన్నై: తమిళనాడులోని తుతికోరిన్ సముద్ర తీరానికి గతరాత్రి నుంచి పెద్ద సంఖ్యలో తిమింగళాలు కొట్టువచ్చాయి. దాదాపు 100 తిమింగళాలు ఒడ్డుకు చేరడంతో స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వీటిలో కొన్నింటిని మత్స్యకారులు, ప్రభుత్వ సిబ్బంది సముద్రం లోపలికి తీసుకెళ్లి వదిలినా మళ్లీ ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. మనపాడు, కళ్లమొజి గ్రామాల్లోని సముద్ర తీరానికి తిమింగాలు కొట్టుకువచ్చినట్టు జిల్లా సీనియర్ అధికారి కుమార్ తెలిపారు. మనపాడు సముద్రతీర ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఇక్కడకు పెద్ద సంఖ్యలో తిమింగాలు కొట్టుకురావడం ఇదే మొదటిసారి అని చెప్పారు. ఇవన్నీ చిన్న మొప్పలు కలిగిన తిమింగళాలు అని తేల్చారు. ఇవి ఎందుకు కొట్టుకువచ్చాయో తెలుసుకోవాలని మనార్ మెరైన్ పార్క్, ఫారెస్ట్ అధికారులను కోరామని రవికుమార్ తెలిపారు. గతేడాది ఆగస్టులో 33 అడుగుల తిమింగళం నాగపట్టణం జిల్లాలోని సముద్ర తీరానికి కొట్టుకువచ్చిన సంగతిని ఆయన గుర్తు చేశారు.