కాకినాడ: వాకలపూడి హరితా రిసార్ట్స్ వెనుక భాగంలోని సముద్రతీరానికి గురువారం ఉదయం భారీ తిమింగలం (బుక్కుసొర్ర) కొట్టు కొచ్చింది. 13 అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పు ఉన్న తిమింగలం టన్నుకు పైగా బరువు ఉంది. సముద్రంలో చేపలు తింటూ.. ఒడ్డునున్న ఇసుకలోకి రావడంతో తిరిగి లోపలికి వెళ్లలేక చనిపోయిందని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. ఈ భారీ తిమింగలాన్ని చూసేందుకు పర్యాటకులు, మత్స్యకారులు తరలివెళ్తున్నారు.
ఉప్పాడ సముద్ర తీరంలోనూ భారీ తిమింగలం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. విషయం తెలుసుకున్న కోరంగి అభయారణ్యం అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఉప్పాడ సముద్రతీరానికి వెళ్లి క్రేన్ల సాయంతో చొల్లంగి అభయారణ్యానికి తరలించారు. రెండున్న టన్నుల బరువున్న తిమింగలం పొట్టను చీల్చి పేగులు, వ్యర్థాలను బయటకు తీసి ఒక టన్ను బరువుకు తగ్గించారు. సందర్శకుల కోసం ఉంచారు.