
జైపూర్: రాజస్తాన్‌లోని చూరు జిల్లాకు చెందిన గుడ్డీ (42) అనే మహిళ పదకొండు మంది అమ్మాయిలకు జన్మనిచ్చిన తర్వాత పన్నెండో కాన్పులో మగ బిడ్డకు జన్మనిచ్చింది. కేవలం ఆడబిడ్డలనే కంటున్నావంటూ తన భర్త కృష్ణ కుమార్, ఇరుగుపొరుగు వారు తనను నిందించేవారని ఆమె చెప్పారు. తన వంశాన్ని కొనసాగించేందుకు మగబిడ్డ కావాలంటూ ఆమె భర్త కోరేవాడని తెలిపింది. మగబిడ్డకు ముందు పుట్టిన అమ్మాయిల్లో ముగ్గురికి పెళ్లిళ్లు అయ్యాయి. అందులో పెద్ద కుమార్తె వయసు 22. వీరిలో ఇద్దరు బిడ్డలు ఇంకా స్కూల్లో చేరాల్సి ఉండగా మిగిలిన వారు స్కూల్లో చదువుతున్నారు. ఇంతమంది బాధ్యతలు ఎలా నెరవేర్చగలవన్న ప్రశ్నకు ఆమె చిరునవ్వును సమాధానంగా ఇచ్చారు. 2017లో కూడా మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ 10 మంది ఆడబిడ్డల తర్వాత మగబిడ్డకు జన్మనిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment