Rajasthan woman
-
ఆకట్టే కనికట్టు: మెంటలిస్ట్ సుహానీ షా
సుహానీ షాను ఇండియాలో ఏకైక ఫిమేల్ మెంటలిస్ట్ అంటారు. ఇప్పటికి 5000 ప్రదర్శనలు ఇచ్చిన సుహానీ స్టేజ్ మీద ప్రేక్షకులను దిగ్భ్రమ పరిచే చమత్కారాలు చేస్తుంది. సంప్రదాయ మేజీషియన్ల వేషంలో కాకుండా ఆధునికమైన ఆహార్యంలో ఆమె భ్రాంతిని, విభ్రాంతిని, కనికట్టును ప్రదర్శిస్తుంది. అందుకే దేశంలోని ఏదో ఒక నగరంలో ఆమె ప్రదర్శనకు సంబంధించిన ప్రకటన కనపడుతూనే ఉంటుంది. సుహానీ సక్సెస్ స్టోరీ. సుహానీ షా తన షోలో మిమ్మల్ని స్టేజ్ మీదకు పిలుస్తుంది. మీరెవరో ఆమెకు తెలియదు. ఆమెతో మీరు ఎప్పుడూ మాట్లాడి ఉండరు. ‘మీకు ఇష్టమైన పాట తలుచుకుని మనసులో పాడుకోండి’ అంటుంది. మీరు ఒక నిమిషం మనసులో పాడుకుంటారు. అప్పుడు సుహానీ షా తన చేతిలోని సెల్ఫోన్లో ఒక పాట మ్యూట్‌లో ప్లే చేసి పక్కన పెట్టి, మీరు ఏ పాట అనుకున్నారో మైక్‌లో చెప్పండి అంటుంది. ‘మౌనంగానే ఎదగమని’ అని మీరు అంటారు. ఆ ఫోన్లో చూడండి అంటుంది. ఆశ్చర్యం. అందులో అదే పాట అప్పటికే ప్లే అవుతూ ఉంటుంది. మీరు మనసులో అనుకున్న పాట ఆమెకు ఎలా తెలిసింది? అదే మైండ్ రీడింగ్. మళ్లీ ఇంకొకరిని పిలుస్తుంది. ‘ఎవరినైనా మీకు పరిచయమున్న వ్యక్తిని తలుచుకోండి’ అంటుంది. అతను తలుచుకుంటాడు. ఫ్రెండా? అడుగుతుంది. బంధువు అంటాడు. మీరు కళ్లు మూసుకుని ఆ మనిషిని మీ ఎదురుగా ఊహించుకోండి అంటుంది. ఆ తర్వాత తన చేతిలో ఉన్న పలక మీద ఒక పేరు రాసి పక్కన పెడుతుంది. కళ్లు తెరిచి మీరు తలుచుకున్న వ్యక్తి పేరు చెప్పండి అంటుంది. అతను చెప్తాడు. పలక చూపిస్తుంది. ఆశ్చర్యం. ఆ పలక మీద అప్పటికే ఆమె ఆ పేరు రాసి ఉంది. అదీ మైండ్ రీడింగే. ఇలాంటివి చేసే మహిళ మన దేశంలో సుహానీ షా ఒక్కర్తే ఉంది. అందుకే ఆమె భారతదేశ ఏకైక ఉమన్ మెంటలిస్ట్. చిన్నప్పటి నుంచి సుహానీ షాది రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్. ఏడేళ్ల నుంచే మేజిక్ చేయడం మొదలెట్టింది. ఆ మేజిక్‌లు పెద్ద హిట్ అయ్యేసరికి స్కూల్‌కు వెళ్లే వీలే కలగలేదు. దేశ విదేశాలు మేజిక్‌లు చేస్తూ వెళ్లింది. దాంతో 14 ఏళ్ల వరకు ఆమెకు రాయడం రాదు. 16 ఏళ్ల వరకు ఇంగ్లిష్ మాట్లాడటం రాదు. కాని ఇప్పుడు నాలుగైదు భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది. ‘సాకులు చెప్పొద్దు’ అంటుంది ఎవరైనా ఏదైనా రాదు అంటే. ‘నేర్చుకోవాలనే సంకల్పం ముఖ్యం’ అంటుంది. సుహానీ షా మొదట మేజిక్‌లు చేస్తూ, తర్వాత ఇల్యూషన్స్ చేస్తూ, ఆ తర్వాత మైండ్ రీడర్‌గా మారింది. మెంటలిస్ట్ అంటే? మెజీషియన్లాగా సంగీతం, ఎక్విప్మెంట్, హంగామా ఏమీ ఉండదు. సరికొత్త ఆహార్యంలో ఒక్కరే వచ్చి స్టేజ్ మీద నుంచి ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. ఎదురుగా కూచున్న వారిలో ఒకరి పెళ్లిరోజు ఏదో చెప్పడం, ఒకరి ఫోన్ తీసుకుని అన్‌లాక్ చేయడం, ఒకరి గతాన్ని చెప్పడం, మరొకరి భవిష్యత్తును చెప్పడం, మనసులో అనుకున్న అంకెలు తెలియచేయడం... ఇవన్నీ మెంటలిస్ట్ చేస్తారు. సుహానీ షా తాను ఒక్కతే స్టేజ్ మీద నిలబడి ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుంది. ‘ఇందుకు దివ్యశక్తులు ఏమీ అక్కర్లేదు. సాధనతో సాధించిన స్కిల్ ఇది’ అంటుంది సుహానీ షా. ‘మామూలు మేజిక్‌లు చాలా కాలం చేశాక దీనికంటే పై స్థాయికి వెళ్లాలని ఎదుటివాళ్ల మైండ్ రీడింగ్ చేయాలని కొన్నాళ్ల పాటు హిమాలయాలకు వెళ్లి షో డిజైన్ చేస్తూ కూచున్నాను. మూడు నాలుగేళ్లుగా మెంటలిస్ట్‌గా షోలు చేస్తున్నాను’ అంటుంది సుహానీ. మోటివేషనల్ స్పీకర్ సుహానీ కేవలం షోస్ మాత్రమే చేయదు. యూట్యూబ్‌లో పర్సనాల్టీ డెవలప్మెంట్ మీద వీడియోలు చేస్తుంది. ఆమెకు గోవాలో హిప్నో క్లినిక్ ఉంది. దురవాట్లను మాన్పించడంలో ఆమె వ్యక్తులకు సాయ పడుతుంటుంది. ‘జీవితంలో ఏ పనీ చేయనివారు ఏదో ఒకటి సాధించాలని అనుకోని వారు తమ జీవితాలను వృథా చేసుకుంటున్నట్టు లెక్క’ అంటుందామె. సుహానీకి లక్షల కొద్ది అభిమానులు ఉన్నారు. ఆమె షోస్ నగరాల్లో జరుగుతూనే ఉంటాయి. ఈసారి మీ దృష్టికి వస్తే వెళ్లి చూడండి. -
Captain Shiva Chouhan: సియాచిన్ పై వీర వనిత
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సరిహద్దు రక్షణ స్థానం సియాచిన్‌లో మొట్టమొదటిసారిగా ఒక మహిళా ఆఫీసర్ దళాధిపతిగా నియమితురాలయ్యింది. 15 వేల అడుగున ఎత్తున దేశ రక్షణకు నిలిచిన కెప్టెన్ శివ చౌహాన్ ఈపోస్ట్ పొందడానికి ఎంతో కష్టతరమైన ట్రయినింగ్‌ను పూర్తి చేశారు. శివ చౌహాన్ వివరాలు. గతంలో సియాచిన్‌కు విధి నిర్వహణకు పంపే సైనికులతో అధికారులు ‘మీరు ముగ్గురు వెళితే ఇద్దరే తిరిగి వస్తారు’ అని హెచ్చరించి పంపేవారు. ‘ఇద్దరే తిరిగి వచ్చినా దేశం కోసంపోరాడతాం’ అని సైనికులు సమరోత్సాహంతో వెళ్లేవారు. అయితే వారి ప్రథమ శత్రువు పాకిస్తాన్ కాదు. ప్రతికూలమైన ప్రకృతే. మైనస్ 55 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, తీవ్రమైన చలి గాలులు, హిమపాతం, కాలు జారితే ఆచూకీ తెలియని మంచులోయలు... సియాచిన్‌లో 35 అడుగుల ఎత్తు మేరకు కూడా మంచు పడుతుందంటే ఊహించండి. ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధస్థావరమైన సియాచిన్ అటు పాకిస్తాన్ నుంచి ఇటు చైనా నుంచి రక్షణ ΄పొందడానికి ఉపయోగపడే కీలక్రపాంతం. అక్కడ ఇన్నాళ్లు మగవారే విధులు నిర్వహించారు. మొదటిసారి ఒక మహిళా ఆఫీసర్ అడుగు పెట్టింది ఆమె పేరే శివ చౌహాన్. 1984 నుంచి దేశ విభజన సమయంలో వాస్తవాధీన రేఖకు అంచున మానవ మనుగడకు ఏమాత్రం వీలు లేని సియాచిన్ ్రపాంతాన్ని అటు పాకిస్తాన్ కాని ఇటు ఇండియాగాని పట్టించుకోలేదు. కాని 1984లో దాని మీద ఆధిపత్యం కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నదని తెలుసుకున్న భారత్ సియాచిన్ అధీనం కోసం హుటాహుటిన రంగంలో దిగి ‘ఆపరేషన్ మేఘదూత్’ పేరుతో విజయవంతమైన సైనిక చర్య చేయగలిగింది. ఆ తర్వాత 1999 వరకూ ఇరు పక్షాల మధ్య చర్యలు, ప్రతిచర్యలు సాగాయి. ‘వాస్తవ మైదాన స్థానరేఖ’ను ఇరుపక్షాలు అంగీకరించి అక్కడ సైనిక స్థావరాలు నిర్మించుకున్నా మంచు ఖండం వంటి సియాచిన్ మీద భారత్ గాని, పాకిస్తాన్‌గాని తన స్థావరాలను తీసేయలేదు. ఇప్పటివరకూ ఇరువైపులా అక్కడ 2000 మంది సైనికులు మరణించారని అంచనా. వారిలో ఎక్కువ మంది కేవలం ప్రతికూల వాతావరణానికే మరణించారు. సైనిక కాల్పుల్లో కాదు. అడుగు పెట్టిన ఆఫీసర్ సంప్రదాయిక విధానాలతోనే నడిచే ఇండియన్ ఆర్మీ మహిళల ప్రవేశాన్ని అన్నిచోట్ల అంగీకరించరు. ఇంతవరకూ 9000 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ బేస్ క్యాంప్ వరకే మహిళా ఆఫీసర్లను అనుమతించింది ఆర్మీ. కాని 15000 అడుగుల నుంచి 20 వేల అడుగుల (బాణాసింగ్ బంకర్) ఎత్తు వరకూ సియాచిన్‌లో వివిధ స్థానాలలో ఉండే స్థావరాలకు మహిళా ఆఫీసర్లను పంపలేదు. మొదటిసారిగా శివ చౌహాన్‌కు ఆర్మీ సియాచిన్ హెడ్క్వార్టర్స్లోపోస్టింగ్ ఇచ్చింది. రాజస్థాన్ సాహసి శివ చౌహాన్‌ది రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్. 11వ ఏట తండ్రి మరణిస్తే గృహిణి అయిన తల్లి శివ చౌహాన్‌ను పెంచింది. ‘మా అమ్మే నాకు చిన్నప్పటి నుంచి ఆర్మీ మీద ఆసక్తి కలిగించింది’ అంటుంది శివ. ఉదయ్‌పూర్‌లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన శివ 2020 సర్వీస్ సెలక్షన్ బోర్డ్ పరీక్షలు రాసి ఆలిండియా మొదటి ర్యాంకు సాధించింది. చెన్నైలో ట్రైనింగ్ అయ్యాక 2021లో లెఫ్టినెంట్‌గా ఇంజనీర్ రెజిమెంట్‌లో బాధ్యత తీసుకుంది. ఆ వెంటనే కెప్టెన్ హోదా ΄పొందింది. 2022 కార్గిల్ దివస్ సందర్భంగా సియాచిన్ వార్ మెమోరియల్ నుంచి కార్గిల్ వార్ మెమోరియల్ వరకు 508 కిలోమీటర్ల సైకిల్ యాత్రను శివ చౌహాన్ తన నాయకత్వంలో పూర్తి చేయడంతో ఆమె అధికారుల దృష్టిలో పడింది. దాంతో ఆమెను సియాచిన్‌లో టీమ్ లీడర్గాపోస్ట్ వరించింది. త్రివిధ దళాలలో చరిత్ర సృష్టిస్తున్న స్త్రీల సరసన ఇప్పుడు శివ చౌహాన్ నిలిచింది. కఠిన శిక్షణ సియాచిన్‌లో ఏ స్థావరంలో విధులు నిర్వహించాలన్నా సియాచిన్ హెడ్‌క్వార్టర్స్‌లోని బేటిల్ స్కూల్లో మూడు నెలల శిక్షణ పూర్తి చేయాలి. మిగిలిన మగ ఆఫీసర్లతో పాటు శివ ఈ శిక్షణను పూర్తి చేసింది. ఇందులో కఠినమైన మంచు గోడలను అధిరోహించడం, మంచులోయల్లో పడినవారిని రక్షించడం, శారీరక ఆరోగ్యం కోసం డ్రిల్ పూర్తి చేయగలగడం వంటి అనేక ట్రయినింగ్లు ఉంటాయి. ‘ఆమె శిక్షణను విజయవంతంగా పూర్తి చేసింది. మూసను బద్దలు కొట్టింది’ అని ఆర్మీ అధికారులు అన్నారు. -
11 మంది ఆడపిల్లల తర్వాత మగబిడ్డ
జైపూర్: రాజస్తాన్‌లోని చూరు జిల్లాకు చెందిన గుడ్డీ (42) అనే మహిళ పదకొండు మంది అమ్మాయిలకు జన్మనిచ్చిన తర్వాత పన్నెండో కాన్పులో మగ బిడ్డకు జన్మనిచ్చింది. కేవలం ఆడబిడ్డలనే కంటున్నావంటూ తన భర్త కృష్ణ కుమార్, ఇరుగుపొరుగు వారు తనను నిందించేవారని ఆమె చెప్పారు. తన వంశాన్ని కొనసాగించేందుకు మగబిడ్డ కావాలంటూ ఆమె భర్త కోరేవాడని తెలిపింది. మగబిడ్డకు ముందు పుట్టిన అమ్మాయిల్లో ముగ్గురికి పెళ్లిళ్లు అయ్యాయి. అందులో పెద్ద కుమార్తె వయసు 22. వీరిలో ఇద్దరు బిడ్డలు ఇంకా స్కూల్లో చేరాల్సి ఉండగా మిగిలిన వారు స్కూల్లో చదువుతున్నారు. ఇంతమంది బాధ్యతలు ఎలా నెరవేర్చగలవన్న ప్రశ్నకు ఆమె చిరునవ్వును సమాధానంగా ఇచ్చారు. 2017లో కూడా మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ 10 మంది ఆడబిడ్డల తర్వాత మగబిడ్డకు జన్మనిచ్చింది. -
దాడి చేస్తే ..షాక్ కొడుతుంది
రాజస్థాన్ మహిళపై అత్యాచారం నేపథ్యంలో తెరపైకి రక్షణ పరికరాలు చిన్న చిన్న పరికరాలతో మహిళలకు రక్షణ సాక్షి, బెంగళూరు: కాలేజ్, ఆఫీస్, మెట్రోరైలు, చివరికి ఇంట్లో కూడా మహిళలకు భద్రత కొరవడింది. ఒంటరిగా కనిపిస్తే దాడులు, అత్యాచారాలకు తెగబడుతున్నారు. బెంగళూరులో రాజస్థానీ మహిళపై బుధవారం జరిగిన లైంగిక దాడి ఘటనతో రాష్ట్రం మొత్తం మరోసారి ఉలిక్కిపడింది. మహిళల భద్రత విషయమై చర్చకు తెరతీసింది. ఇలాంటి ఆపత్కర పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ ఉండడం కన్నా మన రక్షణ బాధ్యతను మనమే చూసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం బ్యాగుల్లో అమరిపోయే చిన్నపాటి రక్షణా పరికరాలు అందుబాటులో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఆ పరికరాల గురించిన వివరాలను పరిశీలిస్తే... ఎలక్ట్రిక్ జాకెట్... మామూలు రెయిన్కోట్లా కనిపిస్తూనే మనకు రక్షణ కవచంలా పనిచేసేది ఈ ఎలక్ట్రిక్ జాకెట్. ఈ జాకెట్‌ను మూడు పొరలతో తయారుచేస్తారు. పైకి కనిపించే పొరలో 9వోల్టుల బ్యాటరీని ఏర్పాటుచేస్తారు. పైపొరలో ఏర్పాటైన బ్యాటరీని అనుసంధానం చేస్తూ జాకెట్ చేతుల వద్ద ఒక బటన్‌ను ఏర్పాటుచేస్తారు. ఈ జాకెట్‌ను వేసుకున్న సమయంలో ఎవరైనా మన మీదకు దాడికి వస్తే చేతుల వద్ద ఏర్పాటుచేసిన బటన్‌ను నొక్కితే పైపొరలో కరెంటు పాస్ అవుతుంది. ఆ సమయంలో మనల్ని పట్టుకోవడానికి వచ్చిన వ్యక్తి విద్యుదాఘాతంతో కిందపడిపోతాడు. ఆ సమయంలో మనం దాడి నుండి తప్పించుకునేందుకు వీలుంటుంది. ఈ జాకెట్ ధర రూ.2,500 నుంచి ప్రారంభమవుతుంది. మహిళల రక్షణ కోసం ప్రత్యేక రింగ్... దాడులు, అత్యాచారాలనుంచి మహిళలు తమను తాము రక్షించుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించబడిన ఉంగరమే ‘స్ట్రింగ్ రింగ్’. వేలికి ధరించగలిగే ఈ చిన్నపాటి ఉంగరంలో మైక్రోట్యాంక్, మైక్రోనీడిల్, మైక్రోపంప్లను డ్యూయల్లాక్ మెకానిజంలో ఉపయోగించారు. ఇందులోని మైక్రోట్యాంక్ క్యాపై ్ససిస్ అనే ద్రవాన్ని(క్యాపై ్ససిన్-నాగా చిల్లీ అనే అత్యంత ఘాటైన మిరపకాయలతో తయారైన ద్రవం) కలిగిఉంటుంది. రింగ్ ధరించిన వారిపైకి ఎవరైనా దాడికి వస్తే రింగ్ కింది భాగంలో ఉన్న లాక్‌ని తాకితే అది తెరచుకొని మైక్రో పంప్ మైక్రో నీడిల్లోకి ఈ ద్రవాన్ని పంపుతుంది. అనంతరం దాడికి దిగిన మనిషికి ఈ రింగ్‌ని తాకిస్తే ఆ ద్రవం వారి శరీరంలోకి వె ళుతుంది. తక్షణమే వారు భరించలేని నొప్పితో కిందపడిపోతారు. ఆ సమయంలో బాధితులు సులువుగా తప్పించుకోవచ్చు. దీని ధర రూ.2000 వేల నుంచి ప్రారంభమవుతుంది. కీ చెయిన్ పర్సనల్ అలారం... ఒంటరిగా వెళ్లే మహిళలు స్వీయ రక్షణ కోసం బ్యాగులో తీసుకెళ్లగల చిన్నపాటి పరికరమే కీచెయిన్ పర్సనల్ అలారం. ఈ కీ చెయిన్ అలారం లోపల 120 వోల్టుల బ్యాటరీ అమర్చబడి ఉంటుంది. కీ చెయిన్‌కు చిన్నపాటి పిన్కూడా అమర్చబడి ఉంటుంది. ఆపద సమయంలో ఈ పిన్ను నొక్కితే కీచెయిన్లో అమర్చిన బ్యాటరీ నుంచి 130డెసిబెల్స్ శబ్దం వెలువడుతుంది. దీంతో దాడి చేయడానికి వచ్చిన వారు కంగారుపడి పారిపోవడమే కాకుండా దగ్గరలో ఉన్న వారికి కూడా మీరు ఆపదలో ఉన్న విషయాన్ని తెలియజేయవచ్చు. తద్వారా దాడి నుండి తప్పించుకునేందుకు అవకాశం ఉంది. ఈ కీచెయిన్ను రాత్రి వేళల్లో కూడా ఉపయోగించేందుకు వీలుగా స్పాట్లైట్ను కూడా కలిగి ఉంటుంది. ఈ పరికరం ధర రూ.620 నుంచి ప్రారంభమవుతుంది. పెప్పర్ స్ప్రే.. మహిళలు తమపై జరిగే దాడులను ఎదుర్కొనేందుకు ఎంతగానో ఉపకరించే పరికరాల్లో పెప్పర్ స్ప్రే ముఖ్యమైనది. చిన్నపాటి డబ్బాల్లో మిరియాల ద్రావణం, లేదా కారం పొడితో కలిపి చేయబడిన ఈ స్ప్రేను హ్యాండ్‌బాగుల్లో ఎంచక్కా తీసుకెళ్లవచ్చు. ఎవరైనా దాడి చేసే సమయంలో వారి కళ్లలోకి ఈ స్ప్రేను చల్లితే సరిపోతుంది. స్ప్రే ఘాటుకు దుండగుడు విలవిల్లాడుతూ పడిపోవాల్సిందే. ఈ పెప్పర్ స్ప్రే ధర రూ.200 నుంచి ప్రారంభమవుతుంది.