
ముంబై: బాలీవుడ్ నటుడు అపర్‌శక్తి ఖురానా తండ్రయ్యాడు. అతడి భార్య ఆకృతి అహుజా శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియా వేదికగా అపర్‌శక్తి ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నాడు. పాపకు అర్జోయీ ఎ. ఖురానాగా నామకరణం చేసినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో ఖురానా దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘చిన్నారి దేవతకు స్వాగతం’’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక చిన్నారి రాకతో తమ కుటుంబం మరింత పెద్దదైందని, ఇదొక గొప్ప అనుభూతి అని బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా ఆనందం వ్యక్తం చేశాడు.
కాగా ఆయుష్మాన్ ఖురానా తమ్ముడైన అపర్‌శక్తి.. ఆమిర్ ఖాన్ దంగల్ మూవీతో బీ-టౌన్‌లో అడుగుపెట్టాడు. సాత్ ఉచాకే, బద్రీనాథ్ కీ దుల్హనియా, హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగీ, స్త్రీ, లుకా చుప్పీ, రాజ్మా చావల్ వంటి సినిమాల్లో నటించాడు. బాలా, పతీ పత్నీ ఔర్ వో చిత్రాల్లో సోదరుడితో స్క్రీన్ పంచుకున్నాడు. నటుడు, ఆర్జే, సింగర్, టీవీ హోస్ట్‌గా గుర్తింపు పొందిన అపర్‌శక్తి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక హర్యానా అండర్-19 క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా కూడా అతడు వ్యవహరించాడు.
చదవండి: Shilpa Shetty: కొత్త తప్పులు చేస్తానంటున్న శిల్పాశెట్టి!
Comments
Please login to add a commentAdd a comment