Elon Musk Father Errol Musk Revealed He Second Child With Stepdaughter Jana Bezuidenhout - Sakshi
Sakshi News home page

Errol Musk: 35 ఏళ్ల పెంపుడు కుమార్తెతో రెండో బిడ్డను కన్న 76 ఏళ్ల ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్‌ మస్క్‌!

Published Fri, Jul 15 2022 1:33 PM | Last Updated on Fri, Jul 15 2022 2:18 PM

Elon Musk Father Errol Musk Revealed He Second Child With Stepdaughter Jana Bezuidenhout - Sakshi

ఎలన్‌ మస్క్‌ తన తొమ్మిది మంది సంతానంపై ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తరిగిపోతున్న జనాభా సంక్షోభానికి తమ వంతు సాయం చేస్తున్నట్లు ట్వీట్‌ చేశాడు. ఇప్పుడు ఎలన్‌ మస్క్‌కు ఏ మాత్రం తీసిపోనంటూ ఆయన తండ్రి ఎర్రోల్‌ మస్క్‌ సైతం ఈ తరహా వ్యాఖ‍్యలు విస్మయానికి గురి చేస్తున్నాయి. అంతేకాదు మూడేళ్ల క్రితం తన పెంపుడు కుమార్తె జానా బెజుడెన్‌హౌట్‌తో మరోసారి తండ్రినయ్యానంటూ తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో వెల్లడించాడు. 

న్యూయార్క్‌ పోస్ట్‌ కథనం ప్రకారం..యూకేకి చెందిన టాబ్లాయిడ్‌ ఎర్రోల్‌ మస్క్‌ను తాజాగా ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో..ప్రపంచ సంతానోత్పత్తి రేటు తగ్గే అవకాశం ఉందంటూ వాషింగ్టన్ యూనివర్సిటీ ఓ డేటాను విడుదల చేసింది. ఆ నివేదిక ఆధారంగా ఎర్రోల్‌ మస్క్‌ మాట్లాడుతూ..తగ్గిపోతున్న జనాభాకు తన వంతు కృషి చేస్తున్నట్లు చెప్పాడు. మనం ఈ భూమిపై ఉన్నది పునరుత్పత్తి కోసమే. అందుకే  జానాతో తొలిసారి 2017లో అబ్బాయి ఎలియట్ రష్‌కు, 2019లో పాపకు జన్మనిచ్చినట్లు తెలిపాడు. 
 
ఎర్రోల్ మహానుభావుడు
ఎలన్ మస్క్ కు త‌న తండ్రి ఎర్రోల్ మ‌స్క్ అంటే అస్స‌లు న‌చ్చ‌దు. సౌతాఫ్రికాలో బిజినెస్ మ్యాన్ గా ఉన్న ఎర్రోల్ అత్యంత క్రూరుడు. శారీర‌క సుఖ కోసం ఎంత‌కైనా తెగిస్తాడు. ఎర్రోల్ తొలిసారి ఎలన్ మ‌స్క్ త‌ల్లి మేయ‌ల్‌ను వివాహం చేసుకున్నాడు. ఆ త‌రువాత మేయ‌ల్‌కు విడాకులిచ్చి అప్ప‌టికే పెళ్లై 10ఏళ్ల కూతురున్నహెడీని వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవ‌త్స‌రాల త‌రువాత రెండో భార్య హెడీకి విడాకులిచ్చి ఆమె కూతురు జానాను వివాహం చేసుకున్నాడు. ఎర్రోల్‌, జానా దంప‌తులు అబ్బాయి, అమ్మాయికి జ‌న్మ‌నిచ్చారు. కాగా, రెండో భార్య కుమార్తె జానాకు ఎలన్ మ‌స్క్ తండ్రి ఎర్రోల్ మ‌స్క్ వ‌య‌స్సు వ్య‌త్యాసం 40ఏళ్లు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement